అన్నమాచార్య కృతి అన్ని రకాలకూ అనువు
సామాన్యంగా అన్నమాచార్య కృతుల పేరెత్తగానే గుర్తుకు వచ్చేది శ్రీమతి శోభా రాజుగారు.
అందరూ పాడుకోడానికి అనువుగా లలిత సంగీత బాణీలలోనూ, జానపద బాణీలలోనూ
స్వరపరచి, అన్నమయ్య పదకవితా ముత్యాలను మనకంద చేసైనా ఘనత ఆమెకే దక్కాలి.
అయినప్పటికీ మా గురువుగారు, తాళ బ్రహ్మ బిరుదాంకితులు, సంగీతనాటక అకాడెమీ గుర్తింపు పొందిన శ్రీ మామిళ్ళపల్లి బాలసుబ్రమణ్య శర్మగారు, కొన్ని అన్నమాచార్య కృతులను ఏరి, వాటికీ చక్కటి కర్ణాటక రాగ బాణీలు చేకూర్చి, స్వరపరిచారు. తితిదే వారు అన్నమాచార్య ప్రాజెక్ట్ మొదలు పెట్టక
ముందే వాటికి ప్రాచుర్యం కల్పించారు. స్వరపరిచిన వెంటనే తమ శిష్యులకు నేర్పించి, అవి అందరికీ తెలిసేలా చేసారు. దీనికి ప్రాముఖ్యత కేవలం వారు స్వరపరిచారు, పాడించారు, పాడారు అన్నదానికంటే కూడా మరొకటి ఉంది. నాకు తెలిసినంతవరకూ, అన్నమాచార్య కృతులను సంపూర్ణంగా
కర్ణాటక బాణీలో పాడేందుకు కూడా ఎంతో వీలుందనీ, ఆవిధంగా పాడటం వలన, ఆ కృతులలో ఉండే సాహిత్య సౌందర్యం ఏమాత్రం తరగదనీ కూడా వారు నిరూపించారు.
“పతియే దైవము తనకూ” అనే ఈ కృతిని కాంభోజి రాగంలో స్వరపరచి, కచేరీలో ముఖ్య ఐటెం గా ప్రదర్శించటానికి కావాల్సిన ఆలాపన, ఇంకా స్వరకల్పన చేయగల చోట్లు కూడా ఉన్నాయని, ఆ విధంగా కల్పించవచ్చనీ విదితమౌతుంది. పండిత పామరుల మనసులను ఒకే రీతిగా ఆనంద డోలికల్లో తేలియాడించవచ్చని ఋజువు చేశారు శ్రీ శర్మ గారు.
అన్నమాచార్య సంస్మరణలో గుర్గామ్ ల, ఎపిసెంటర్ లో “అన్నమాచార్య జయంతి” సందర్భంగా కచేరీ లో నేను పాడిన ఈ కృతిని మీ అందరి కోసం….
ఈ సంచిక చదివి మీ అభిప్రాయాలను ఆయా అంశాల క్రింద ఉన్న
‘ Leave a reply ‘ box లో తెలియజేయండి.