11_016 బాలభారతి – ఐకమత్యము

ఒకఊరిలో ఒక్కరైతు ఉన్నాడు !

ఆరైతు కిద్దరు కొడుకు లున్నారు !

ఆకొడుకు లిద్దరును ౘవట లయ్యారు !

ఒకరితో ఇంకొకరు కలహించువారు !

 

                                    అన్నయ్యమాట ఆతమ్మునికి పడదు !

                                    తమ్మయ్యపొడ అన్న కసలె సరిపడదు !

                                    ఈయిద్దరిని కలుపుదారి కనబడదు !

                                    ఈబాధ ఆతండ్రిహృదయమును విడదు !

 

అంత్యకాలమున రై తాత్మజుల పిలిచి

కట్టెలను మోపుగా కట్టించి ఉంచి

“ మోపు విడదీయకే పుల్లలను విఱిచి

భుజశక్తి చూపు ” – డనె భుజములను ౘఱచి

 

                                    వెఱ్ఱిమొగములు వేయుకొడుకులను చూచి

                                    ‘ వేఱు వేఱుగ చేసి విఱువు ’ మన్నాడు !

                                    ఒక్కొక్కకట్టెనే ౘక్కగా విఱిచి

                                    నిలువగా కొడుకులకు పలికే నిటు తండ్రి !

 

విడి యున్నకట్టెలను విఱుచుమీబలము

కట్టగా నున్నపుడు ప ట్టీయలేడు !

ఐకమత్యమె బలము – తెలిసికొను డోయి !

కలసి యున్ననె మీకు కల దోయి హాయి !

👉🏾మీకు నచ్చితే Like బటన్ నొక్కండి. మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (comment box) లో తెలియజేయండి👇🏾