11_016 ఎక్కడ మనసు…

ఎక్కడ మనసు నిర్భీతిగ నుండునో

ఎక్కడ తలెత్తి మనిషి నిలిచేనో

ఆ స్వేచ్ఛా స్వర్గానికి నా తండ్రి దేశాన్ని నడిపించు

.

ఎక్కడైతే జ్ఞానము

అనంతమో ఓ ఓ ఓ ఓ…..

ఎక్కడైతే జ్ఞానము ఉచితంగా దొరికేనో

ఆ స్వేచ్ఛా స్వర్గానికి నా తండ్రి దేశాన్ని మేల్కొలుపు

.

ఎక్కడైతే స్వార్ధపు హృదయాల గోడలు పగిలి ప్రపంచమంతా ముక్కలు కాబోదో

ఆ స్వేచ్ఛా స్వర్గానికి నా తండ్రి దేశాన్ని నడిపించు

.

ఎక్కడైతే అలుపెరుగని శ్రామికులే తమ చేతులు చాచి

పూర్ణతనాహ్వానించేరో

ఆ స్వేచ్ఛా స్వర్గానికి నా తండ్రి దేశాన్ని నడిపించు

.

ఎక్కడైతే సత్యపు మూలాలనుండి

మాటలు పుట్టుకు వస్తాయో

ఆ స్వేచ్ఛా స్వర్గానికి నా తండ్రి దేశాన్ని మేల్కొలుపు

.

 ఎక్కడైతే కారణవాదం ప్రవాహమై

తన దారిని వదలక సాగేనో

ఆ స్వేచ్ఛా స్వర్గానికి నా తండ్రి దేశాన్ని మేల్కొలుపు

.

ఎక్కడైతే మూఢాచారపుటెడారి దాటి

 బుద్ధి ప్రవాహము ఇంకక సాగేనో

ఆ స్వేచ్ఛా స్వర్గానికి నా తండ్రి దేశాన్ని మేల్కొలుపు

.

 ఎక్కడైతే మనసంతా నీ విశాల భావన తో

 ముందుకు మునుముందుకు సాగేనో

ఆ స్వేచ్ఛా స్వర్గానికి నా తండ్రి దేశాన్ని మేల్కొలుపు

.

***********

మూలం : విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్

తెలుగు అనువాదం :

శ్రీ గుడిపాటి వెంకటాచలం

స్వేచ్చానువాదం : పద్మకళ

👉🏾మీకు నచ్చితే Like బటన్ నొక్కండి. మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (comment box) లో తెలియజేయండి👇🏾