11_016&17

.

ప్రస్తావన

.

పది సంవత్సరాలు పైబడి లాభాపేక్ష రహితంగా నిర్వహిస్తూ వస్తున్న ‘ శిరాకదంబం ’ పత్రిక కార్యస్థానం ప్రస్తుతం హైదరాబాద్ కి మారింది. పాఠకులు, చందాదారులు, శ్రేయోభిలాషులు అందరూ గమనించ ప్రార్థన. కొన్ని ప్రత్యేక పరిస్థితుల వలన గతంలో కొద్ది రోజులు హైదరాబాద్ నుంచి నిర్వహించినా సింహభాగం ఆంధ్ర ప్రాంతం నుంచే నడిచింది. ఎందరో రచయితలు, రచయిత్రులు తమ రచనల ద్వారా పత్రికను సుసంపన్నం చేస్తూ వచ్చారు. కొందరు అభిమానులు, శ్రేయోభిలాషులు చందాలను కట్టడం ద్వారా కొంత మేరకు అండగా ఉంటున్నారు. అయితే నిర్వహణ భారం పెరిగిపోతూ ఉంది. మనిషి జీవన వ్యయం కూడా అనేక కారణాల వలన మరింత వేగంగా రోజు రోజుకూ పెరిగిపోతూనే ఉంది. ఈ రెండింటి మధ్య సమన్వయం చేసుకోవడం కత్తి మీద సాము అవుతోంది. మరింతమంది చందాదారులుగా చేరడం వలన, తమ బంధు మిత్రులను చేర్పించడం వలన, వాణిజ్య ప్రకటనలను అందించడం వలన పత్రికకు ఆర్థిక వెసులుబాటు కలిగి మరిన్ని క్రొత్త ప్రయోగాలు చెయ్యడానికి, మరింత విస్తరించడానికి వీలు కలుగుతుంది. ప్రస్తుతం ప్రతి సంచికకు సుమారుగా 50,000 పైబడి హిట్స్ సాధిస్తూ వస్తోంది.

రాబోయే రోజుల్లో కొన్ని క్రొత్త అంశాలను జోడించడానికి, మరిన్ని ప్రయోగాలను చెయ్యడానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ సాధ్యం కావాలంటే పాఠకుల, ప్రకటనకర్తల, శ్రేయోభిలాషుల తోడ్పాటు ఎంతో అవసరం.

గత రెండేళ్లుగా మానవ జీవితం ప్రపంచ వ్యాప్తంగా అస్తవ్యస్తమయింది. కరోనా మహమ్మారి అనేక జీవితాలను ఛిద్రం చేసింది. చాలామంది వృత్తి, వ్యాపారాలను పూర్తిగానో, పాక్షికంగానో కోల్పోయారు. ఇప్పుడిప్పుడే అన్నీ కుదుటపడుతున్నాయి అని ఊపిరి పీల్చుకుంటుంటే మళ్ళీ మహమ్మారి విరుచుకు పడబోతోంది అన్న వార్తలు కలవరపెడుతున్నాయి. ఈసారైనా అందరూ తగిన జాగ్రత్తలు పాటిస్తే కొంతవరకు ఫలితం ఉంటుందేమో ! మరో ప్రక్క రష్యా ఉక్రైన్ యుద్ధం కూడా ప్రపంచ దేశాలన్నిటి మీద ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగిపోతున్నాయి. వాటి మీద ఆధారపడిన వాటన్నిటి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వంట నూనెల ధరల పరిస్తితి కూడా అంతే ! సామాన్యుడు బతికే పరిస్థితి ఉందా…. అంటే కష్టమే. అయితే దీనిని నియంత్రించే యంత్రాంగం లేదా అంటే ఉంది. కానీ ఏమీ చేయలేని పరిస్తితి. ప్రతి యేటా ఏవో గడ్డు పరిస్థితులు వస్తూనే ఉంటాయి. ప్రజలు గగ్గోలు పెడుతూనే ఉంటారు. భరిస్తూనే ఉంటారు. అలవాటు పడిపోతారు. ఇదొక నిరంతర జీవన ప్రవాహం.         

******************************************************************************************

.

 

కరోనా జాగ్రత్తలు పాటించండి. మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి.

ఇంట్లోనే ఉండండి….. సురక్షితంగా ఉండండి.

మనవి :శిరాకదంబం అమెజాన్ పేజీ ” లో మీకు కావల్సిన చాలా వస్తువులు దొరుకుతాయి. మీకు కావల్సిన వస్తువుల మీద క్లిక్ చేసి ఆర్డర్ చేయండి. అలాగే ప్రతి పేజీలో ‘ అమెజాన్ ’ లో దొరికే వస్తువుల లింక్ లు ఉంటాయి. వాటిలో మీకు అవసరమైన వాటిని ఆ లింక్ క్లిక్ చేసి కొనుగోలు చేయండి. తద్వారా ‘ శిరాకదంబం ’ కు సహాయపడవచ్చు. 

కృతజ్ఞతలు

ఇటీవల ఇచ్చిన పిలుపు కి స్పందించి ‘ శిరాకదంబం ’ క్రొత్తగా చందాదారులుగా చేరిన… చేరుతున్న వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

చందా వివరాలకు Menu లో ఉన్న subscription form ( link ) చూసి, వివరాలు పూర్తి చేసి ( Submit ) పంపండి. ఒక సంవత్సరానికి : భారతదేశంలో ₹. 600/- విదేశాల్లో $. 10 ; రెండు సంవత్సరాలకు : భారతదేశంలో ₹. 1000/- విదేశాల్లో $. 15. జీవితకాలం : భారతదేశంలో ₹. 10000/- విదేశాల్లో $. 150.


మీ మిత్రులను, బంధువులను కూడా చందాదారులుగా చేర్పించండి.

Please Subscribe & Support


మీ చందా Google Pay UPI id : sirarao@okaxis

( ఇది url లింక్ కాదు ) కు పంపించవచ్చు.

అలాగే paypal.me/sirarao కు కూడా పంపవచ్చు.

వివరాలకు editor@sirakadambam.com / editorsirakadambam@gmail.com

‘ శిరాకదంబం ‘ పత్రికకు చందా కట్టడానికి –

           

Or use G Pay UPI ID : sirarao@okaxis ( Please note this isn’t a url link )

or Click here –> paypal.me/sirarao

Please visit

సాహిత్య శారదీయం
– శిరాకదంబం పేజీ