11_018&019AV ఆనందవిహారి

                                       

      తంత్రీ వాద్య సంగీత విభావరి

నగరంలో నెలకొన్న కోవిడ్ పరిస్థితుల కారణంగా స్థానిక తెలుగు సంస్థ అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి తన “నెల నెలా వెన్నెల” కార్యక్రమాన్ని రెండేళ్ళుగా అంతర్జాలం ద్వారా నిర్వహిస్తున్న విషయం పాఠకులకు తెలిసిందే. యూట్యూబ్ ద్వారా ప్రసారమవుతున్న ఈ సాహిత్య, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాల పరంపరలో ఇరవై అయిదో కార్యక్రమాన్ని పురస్కరించుకొని శనివారం సాయంత్రం “తంత్రీ వాద్య సంగీత విభావరి” పేరుతో ప్రత్యేక కార్యక్రమం ప్రసారమైంది. ఇందులో భాగంగా చెన్నై నగరానికి చెందిన కళాకారులే కాక మలేషియా నుంచి కూడా వర్ధమాన వాద్య కళాకారులు కర్ణాటక, హిందుస్తానీ సాంప్రదాయాలలో వీనులకు విందు చేశారు. అనేక రాగాలను, కీర్తనలను వినిపించారు. వీణ మీద కె. సౌమ్య, మాండోలిన్ పై యు. జయ విఘ్నేష్, వయోలిన్ మీద శ్రీలక్ష్మీ భట్, సితార్ పై సింగపూర్ కు చెందిన సుమతీ నారాయణన్, కెరిన్ లింగ్ సూ పింగ్, జయశ్రీ ఆరుముగంలు ప్రతిభ  చూపారు. చెన్నైకి చెందిన పారుపల్లి సుజన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుజన ప్రముఖ వైణికురాలు కావడంతో సందర్భానుసారంగా ఆమె చేసిన వ్యాఖ్యానం కార్యక్రమం ఔన్నత్యాన్ని పెంచింది. 

👉🏾మీకు నచ్చితే Like బటన్ నొక్కండి. మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (comment box) లో తెలియజేయండి👇🏾