11_020

.

ప్రస్తావన

.

శిరాకదంబం ’ వచ్చే ఆగష్టు 15వ తేదీకి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. అనేక ఇబ్బందులు, కష్టనష్టాల మధ్య పాఠకుల ఆదరణ, రచయితల అండదండలతో, శ్రేయోభిలాషుల ఆశీస్సులతో పుష్కరంలోకి అడుగుపెడుతోంది. ఎన్నో మార్పులు చేర్పులు చెయ్యడం జరిగింది. కాలక్రమేణా పాఠకులకు అభిరుచులకు అనుగుణంగా ఇంకా అనేక మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఆయా మార్పులు పాఠకులను అలరిస్తాయనే అభిలాషిస్తున్నాము.

అనివార్య కారణాల వలన ఈ నెల 01 వ తేదీ సంచిక వెలువడలేదు. అందుకు క్షంతవ్యులం. కార్యస్థానం హైదరాబాద్ కు మారినందున తలెత్తిన కొన్ని ఇబ్బందుల వలన గత రెండు నెలలుగా సంయుక్త సంచికగా వెలువరించడం జరుగుతోంది. ఇక నుంచి ఎప్పటిలాగే ప్రతినెలా రెండు సంచికలు వెలువదుతాయని గ్రహింప ప్రార్థన.

మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి అవుతోంది. ఆ సందర్భంగా ‘ ఆజాదీ కా అమృత మహోత్సవ్ ’ పేరుతో అనేక కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. ఇదే సందర్భాన్ని పురస్కరించుకుని ‘ అమృత భారతం ’ అనే శీర్షికతో పత్రిక వార్షికోత్సవ సంచికలో ప్రచురణ నిమిత్తం వ్యాసాలను ఆహ్వానిస్తున్నాం. ఆగష్టు 07వ తేదీ లోపు అందిన వ్యాసాలను స్వీకరించడం జరుగుతుంది. వ్యాసం రెండు లేక మూడు పేజీలకు మించకుండా ఉండాలి. యూనికోడ్ లో తెలుగులో టైప్ చేసి పంపాలి. వ్యాసాలు కేవలం స్వాతంత్ర్య పోరాటం గురించి మీకు తెలిసిన విశేషాలు, భవిష్యత్ ఆకాంక్షలు వంటి వాటి నేపథ్యంలో ఉండాలి. రాజకీయపరమైన, మత కులపరమైన వ్యాఖ్యానాలు, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉన్న వ్యాసాలను ప్రచురణకు స్వీకరించడం జరగదని గ్రహింప ప్రార్థన.

మీ అందరి ప్రోత్సాహంతో, సహకారంతో ‘ శిరాకదంబం ’ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించగలదని ఆశిస్తూ….. ఈ విజయానికి కారకులైన పాఠకులకు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ…..

                                                                                                                  మీ

                                                                                                            శి. రా. రావు   

   .

******************************************************************************************

.

కరోనా జాగ్రత్తలు పాటించండి. మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి.

ఇంట్లోనే ఉండండి….. సురక్షితంగా ఉండండి.

మనవి :శిరాకదంబం అమెజాన్ పేజీ ” లో మీకు కావల్సిన చాలా వస్తువులు దొరుకుతాయి. మీకు కావల్సిన వస్తువుల మీద క్లిక్ చేసి ఆర్డర్ చేయండి. అలాగే ప్రతి పేజీలో ‘ అమెజాన్ ’ లో దొరికే వస్తువుల లింక్ లు ఉంటాయి. వాటిలో మీకు అవసరమైన వాటిని ఆ లింక్ క్లిక్ చేసి కొనుగోలు చేయండి. తద్వారా ‘ శిరాకదంబం ’ కు సహాయపడవచ్చు. 

కృతజ్ఞతలు

ఇటీవల ఇచ్చిన పిలుపు కి స్పందించి ‘ శిరాకదంబం ’ క్రొత్తగా చందాదారులుగా చేరిన… చేరుతున్న వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

చందా వివరాలకు Menu లో ఉన్న subscription form ( link ) చూసి, వివరాలు పూర్తి చేసి ( Submit ) పంపండి. ఒక సంవత్సరానికి : భారతదేశంలో ₹. 600/- విదేశాల్లో $. 10 ; రెండు సంవత్సరాలకు : భారతదేశంలో ₹. 1000/- విదేశాల్లో $. 15. జీవితకాలం : భారతదేశంలో ₹. 10000/- విదేశాల్లో $. 150.


మీ మిత్రులను, బంధువులను కూడా చందాదారులుగా చేర్పించండి.

Please Subscribe & Support


మీ చందా Google Pay UPI id : sirarao@okaxis

( ఇది url లింక్ కాదు ) కు పంపించవచ్చు.

అలాగే paypal.me/sirarao కు కూడా పంపవచ్చు.

వివరాలకు editor@sirakadambam.com / editorsirakadambam@gmail.com

‘ శిరాకదంబం ‘ పత్రికకు చందా కట్టడానికి –

           

Or use G Pay UPI ID : sirarao@okaxis ( Please note this isn’t a url link )

or Click here –> paypal.me/sirarao

Please visit

సాహిత్య శారదీయం
– శిరాకదంబం పేజీ