స్వరకల్పన : సి. ఇందిరామణి ( రాగసుధ )
గానం : యామిని చిత్రాడ
రచన : చిత్రాడ కిశోర్ కుమార్
పల్లవి: ఎగురుతోంది ఎగురుతోంది మువ్వన్నెల జెండా
ఎగురుతోంది ఎగురుతోంది ముచ్చటైన మనజెండా
దేశమాత భావాలను వెదజల్లె ఈ జెండా
మువ్వన్నెల జెండా… ముచ్చటైన మనజెండా …….ఎగురుతోంది
చరణం: ధైర్యం త్యాగాల్ని చూపె కాషాయపు రంగు
శాంతీ సత్యాల్ని తెలిపె తెలుపు రంగు
సమతా మమతల్ని పంచె ఆకుపచ్చ రంగు
కాలాన్ని సూచించే కాలచక్రమూ.. ఆ నడుమనున్నదీ అశోకచక్రం …….ఎగురుతోంది
చరణం: గాంధీ నెహ్రూలు కలలుకన్న స్వరాజ్యం
అల్లూరీ ఆజాద్ సమరానికి ప్రతిఫలం
మరెందరో త్యాగధనుల ప్రాణాలకు ప్రతిరూపం
స్మరించాలి స్మృతించాలి
స్మరించాలి స్మృతించాలి మనమంతా వీరందరిని
దేశమాత భావాలను వెదజల్లె ఈ జెండా
పింగళివెంకయ్య సృష్టించినదీ జెండా
మువ్వన్నెల జెండా… ముచ్చటైన మనజెండా …….ఎగురుతోంది
ఈ అంశం పైన మీ అభిప్రాయాలను క్రింద ఉన్న
‘ Leave a reply ‘ box లో తెలియజేయండి.
చాలా బావుంది రచన , గానం. నెహ్రూ పేరు తీసేస్తే బావుంటుంది.