.
.
భారతదేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటోంది. ఆ సందర్భంగా మన ప్రభుత్వం ‘ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ’ పేరిట ఉత్సవాలను చేస్తోంది. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న, చూసిన…, స్వాతంత్ర్యం సిద్ధించిన సమయంలో జన్మించిన తరం దాదాపుగా కనుమరుగవుతోంది.
సమాజంలో మార్పు అనేది సహజం. కాలం గడిచే కొద్దీ ఆ మార్పులు మరింత ఎక్కువ అవుతాయి. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో సహజంగానే ఆ పోరాట ప్రభావం దేశంలోని ప్రతి ఒక్కరి మీదా ఉందనడంలో సందేహం లేదు. అతివాదులు, మితవాదులు అనే బేధం లేకుండా స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న వారి పట్ల, అప్పటి నాయకుల పట్ల ఆరాధనా భావం ఉండేది. ఆగష్టు 15 వస్తోంది అంటే కుల మత బేధం లేకుండా అందరూ సంబరాల్లో మునిగిపోయేవారు. ఎక్కడ చూసినా మువ్వన్నెల జెండాలు రెప రెపలాడేవి. పిల్లలందరూ ఎంతో ఉత్సాహంగా శుభ్రంగా తయారై పాఠశాలలకు వెళ్ళేవారు. తమ దుస్తులకు జెండాలను బ్యాడ్జిలుగా తగిలించుకునేవారు. జెండాలతో ఆ ప్రాంగణాన్ని అందంగా అలంకరించేవారు. ఎంతో భక్తి శ్రద్ధలతో జెండా ఆవిష్కరణలో పాల్గొని జెండా వందనం చేసేవారు. దేశభక్తి గేయాలు, జాతీయ గీతాలు ఆలపించేవారు. నృత్యాలు, నాటకాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు. అన్నిటిలోనూ దేశభక్తి ఉట్టి పడేది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలలో కూడా ఇదే పరిస్థితి. ఇప్పుడు ఆ స్థానంలో నిరాసక్తత చోటు చేసుకుంది. మొక్కుబడి కార్యక్రమంగా మిగిలే పరిస్థితికి వచ్చింది. అన్ని సెలవుల్లాగే ఆగష్టు 15 కూడా ఒక సెలవు రోజుగా భావిస్తున్నారు. ఇటీవల వచ్చిన క్రొత్త పరిణామం సోషల్ మీడియా. అందులో ఒక పోస్ట్ పెట్టేసి తమ దేశభక్తిని చాటుకుంటున్నారు చాలామంది. దానితో బాధ్యత తీరిపోయిందని భావిస్తున్నారు.
స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న నాయకుల పట్ల ప్రజలందరికీ ఆరాధనా భావం ఉండేది ఆరోజుల్లో. ముఖ్యంగా గాంధీ, నెహ్రూ వంటి అగ్రస్థాయి నాయకుల ప్రభావం బాగానే ఉండేది. 1970 ల వరకు ఈ పరిస్థితి ఉంది. దేశభక్తి గీతాలు విరివిగా వస్తూ ఉండేవి. చిన్న పెద్ద అందరూ పాడుకుంటూనే ఉండేవారు. ఆ తర్వాత నుంచి మార్పులు రావడం ప్రారంభం అయింది. దేశభక్తి స్థానాన్ని వ్యక్తిపూజ ఆక్రమించింది. మంచి రాజకీయాల స్థానంలో దుష్ట రాజకీయాల ప్రభావం పెరిగింది. సంవత్సరాల తరబడి కుటుంబాలను, వృత్తి వ్యాపారాలను, ఆస్తి పాస్తులను వదలిపెట్టి, దేశ స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలను పణంగా పెట్టిన యోధుల త్యాగం మరచిపోవడం ప్రారంభం అయింది. చివరికి స్వాతంత్ర్య దినోత్సవం రోజున జెండా ఎగురవెయ్యడానికి కూడా తీరిక లేని పరిస్థితుల్లోకి జారుకున్నాం. జాతీయ జెండా కి కొన్ని నియమాలు, నిబంధనలు ఉంటాయనే విషయం కూడా తెలియని నాయకులు, అధికారులు ఎందరో మనకి ఈనాడు కనిపిస్తారు. దీనిని సరిదిద్దే వ్యవస్థలు కూడా ఈనాడు నిర్వీర్యం అయిపోయాయి.
రవి అస్తమించని సామ్రాజ్యంగా చెప్పుకొని ప్రపంచాన్నే తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నించిన బ్రిటిష్ ప్రభుత్వం మెడలు వంచడానికి పోరాడిన ఎందరో త్యాగధనుల త్యాగం మరువలేనిది. భరతమాత దాస్య శృంఖలాలను తెంచడానికి అవిరళ కృషి చేసి విజయం సాధించిన వారెవరైనా మనకి చిరస్మరణీయులే. వారందరికీ జాతి యావత్తు ఋణపడి ఉంది. ఈ అమృత మహోత్సవ సమయంలో అది మరింత ఆవశ్యకం. మన భవిష్యత్ తరాలవారికి కూడా వీరి త్యాగాన్ని తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే మన ఇప్పుడు అనుభవిస్తున్నామనుకొంటున్న స్వేచ్చా స్వాతంత్ర్యాలకు సార్థకత.
మనవి : దేశ స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంగా ఆగష్టు 15వ తేదీ వెలువడే 11వ వార్షికోత్సవ సంచికలో ప్రచురణ కోసం “ అమృత భారతం ” శీర్షిక క్రింద వ్యాసాలను ఆహ్వానిస్తున్నాం. ఆగష్టు 10 వ తేదీ లోపు అందిన వ్యాసాలను స్వీకరించడం జరుగుతుంది. వ్యాసం రెండు లేక మూడు పేజీలకు మించకుండా ఉండాలి. యూనికోడ్ లో తెలుగులో టైప్ చేసి పంపాలి. వ్యాసాలు కేవలం స్వాతంత్ర్య పోరాటం గురించి మీకు తెలిసిన విశేషాలు, భవిష్యత్ ఆకాంక్షలు వంటి వాటి నేపథ్యంలో ఉండాలి. రాజకీయపరమైన, మత కులపరమైన వ్యాఖ్యానాలు, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉన్న వ్యాసాలను ప్రచురణకు స్వీకరించడం జరగదని గ్రహింప ప్రార్థన.
వ్యాసాలు అందవలసిన చివరి తేదీ : 10 ఆగష్టు 2022.
వ్యాసాలు editorsirakadambam@gmail.com కు గాని, editor@sirakadambam.com కు గాని పంపవలెను.
.
******************************************************************************************
.
కరోనా జాగ్రత్తలు పాటించండి. మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి.
ఇంట్లోనే ఉండండి….. సురక్షితంగా ఉండండి.
మనవి : ” శిరాకదంబం అమెజాన్ పేజీ ” లో మీకు కావల్సిన చాలా వస్తువులు దొరుకుతాయి. మీకు కావల్సిన వస్తువుల మీద క్లిక్ చేసి ఆర్డర్ చేయండి. అలాగే ప్రతి పేజీలో ‘ అమెజాన్ ’ లో దొరికే వస్తువుల లింక్ లు ఉంటాయి. వాటిలో మీకు అవసరమైన వాటిని ఆ లింక్ క్లిక్ చేసి కొనుగోలు చేయండి. తద్వారా ‘ శిరాకదంబం ’ కు సహాయపడవచ్చు.

కృతజ్ఞతలు
ఇటీవల ఇచ్చిన పిలుపు కి స్పందించి ‘ శిరాకదంబం ’ క్రొత్తగా చందాదారులుగా చేరిన… చేరుతున్న వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
చందా వివరాలకు Menu లో ఉన్న subscription form ( link ) చూసి, వివరాలు పూర్తి చేసి ( Submit ) పంపండి. ఒక సంవత్సరానికి : భారతదేశంలో ₹. 600/- విదేశాల్లో $. 10 ; రెండు సంవత్సరాలకు : భారతదేశంలో ₹. 1000/- విదేశాల్లో $. 15. జీవితకాలం : భారతదేశంలో ₹. 10000/- విదేశాల్లో $. 150.
మీ మిత్రులను, బంధువులను కూడా చందాదారులుగా చేర్పించండి.
Please Subscribe & Support
మీ చందా Google Pay UPI id : sirarao@okaxis
( ఇది url లింక్ కాదు ) కు పంపించవచ్చు.
అలాగే paypal.me/sirarao కు కూడా పంపవచ్చు.
వివరాలకు editor@sirakadambam.com / editorsirakadambam@gmail.com
‘ శిరాకదంబం ‘ పత్రికకు చందా కట్టడానికి –
Or use G Pay UPI ID : sirarao@okaxis ( Please note this isn’t a url link )
or Click here –> paypal.me/sirarao