12_001 అష్టావధాన వైభవం

 

ఆగష్టు 7వ తేదీ అమెరికా, రోలింగ్ మెడోస్ లోని శ్రీ షిర్డిసాయి మందిర్ లో జరిగిన అసమాన అవధాన సార్వభౌమ పండిత శ్రీ పాలపర్తి శ్యామలానంద గారి అష్టావధాన వైభవం నుంచి కొన్ని…..

 

  1. నిషిద్ధాక్షరి :

కీచక వధ – ‘ క ’ వర్గ నిషేధము

 

పూరణ :

 

తానే ద్రోవది దాసియై నచట సంధానించి యేడాదిలో

రాణిన్ సంతసమంద జేయ పనులెల్లన్ తీర్చుచో తమ్ముడున్

దానిం జూచెను జేరబిల్చి చని మద్యం బిప్దు తేతెమ్మనెన్

మానాంతంబొనరింపబోవ తెలివిన్ మ్రందించె భీముండహో !    

 

  1. దత్తపది : శ్రీ నందుల మురళి

లంక, పాక్, బంగ్లా, నేపాల్ – భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు

 

పూరణ :

 

అకలంకం బుగ నన్ని రంగములలో ఆద్యస్థితిన్నిల్వగా

ఒకవైపాకట పేదలింకొకట నెంతోసంపదల్లేనటుల్

ఇకపై బంగళపాకలన్ చనక తామే భవ్యగేహస్థులూ

రకనేపాలకుపిల్లలేడ్వనటులన్ రాణింపుమా భారతీ !    

 

  1. సమస్య : శ్రీనివాస కె. శివరాజు

కుచములు గోసిరి వనితాలు కుశలత తోడన్ !

 

పూరణ :

 

అచటన్ వివాహ వేళకు

ముచటన్ పులిహోర జేయ బోలెడు తేగా

విచికిత్స లేక వారు లి

కుచములు గోసిరి వనితాలు కుశలత తోడన్ !

 

——(0)——

👉🏾ఈ అంశంపై మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (Leave a reply box) లో తెలియజేయండి👇🏾