.
.
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడిచిపోయింది. సుమారు రెండు శతాబ్దాలు ఆంగ్లేయుల పాలనలో మగ్గిన భరత జాతి విముక్తి లభించి స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది. నిజానికి పరాయి పాలన మన దేశానికి క్రొత్త కాదు. అంతకుముందు కూడా విదేశీయుల దండయాత్రలు అనేకం జరిగాయి. కొంతకాలం పరాయి పాలనలో ఉండటం, మన దేశ పౌరుల పట్టుదల, రాజుల పౌరుషం కారణంగా మన దేశాన్ని కాపాడుకుంటూ ఉండటం, మళ్ళీ ఎవరో వచ్చి ఆక్రమించడం, మళ్ళీ వారితో యుద్ధాలు…. ఇలా సాగుతున్న చరిత్రలో బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్ర్యాన్ని పొందడానికి చేసిన పోరాటం చారిత్రికమైనది.
అప్పటివరకూ అనేక రాజ్యాలుగా, సంస్థానులుగా ఎన్నో భాగాలుగా విడిపోయి, ఐకమత్యం అనేది లేకుండా తమలో తాము కలహించుకుంటూ ఉన్న జాతి యావత్తూ ఒకటై పొరాడి సాధించింది. గత చరిత్రను ఉటంకిస్తూ భారత దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చినా ఎంతోకాలం నిలబెట్టుకోలేదని, ఐకమత్యం అనేది లేదని హేళన చేసిన వారందరికీ సమాధానంగా విజయవంతంగా 75 యేళ్ళు పూర్తి చేసుకోవడమే కాదు… ప్రపంచ దేశాలలో బానిస దేశంగానే గుర్తింపు పొందిన దశ నుండి అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడే స్థాయికి ఎదుగుతోందనడంలో సందేహం లేదు. దీని వెనుక ఎంతోమంది రాజకీయ నాయకులు, పాలకులు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలు వంటి వారితో బాటు ఎంతోమంది కర్షకులు, కార్మికులు వంటి వారెందరిదో కృషి ఉంది.
1947 లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు… వనరులు అన్నీ దోచుకోబడిన, అరకొర సౌకర్యాలు ఉన్న దశ నుంచి ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ ‘ ఏడంతస్తుల మేడ ’ నిర్మించినట్లు మన దేశాన్ని నిర్మించుకున్నాం. ఇందులో దేశంలోని ప్రతి ఒక్కరి కష్టం ఎంతో కొంత మేర ఉంది. సుష్టుగా రుచికరమైన షడ్రసోపేతమైన భోజనం తినడానికి ఏర్పాట్లు చేసుకుంటే పంటి కింద రాయిలా అడ్డుపడుతున్నాయి అవినీతి, స్వార్థ పరత్వం. ప్రతి రంగంలోనూ మంచీ చెడు రెండూ ఉండటం సహజం. చెడు ని ప్రక్కన పెట్టి మంచి ని స్వీకరిస్తే ప్రపంచలోని అగ్ర రాజ్యాల సరసన చేరే అవకాశం ఇప్పటికే వచ్చేదేమో ! కానీ రాను రాను అవినీతి, స్వార్థం బలంగా వేళ్లూనుకుంటూ ఉంటూ… చివరికి సామాన్య ప్రజలకి కూడా అలవాటు చేసే పరిస్థితి కి చేరుకున్నాయి. వేపకాయ ఇచ్చి తాటికాయ లాక్కున్నట్లు ప్రజలకి చిన్న చిన్న తాయిలాలు ఇచ్చి ఓట్లు వేయించుకుని అధికారం లోకి వచ్చి ఖర్చు పెట్టిన దానికి ఎన్నో రెట్లు అవినీతితో సంపాదించుకోవడం సర్వసాధారణమై పోయింది. బల్ల క్రింద చెయ్యి పెట్టి లంచంగా ఇచ్చినది తీసుకునే స్థాయి నుంచి, అడిగిన లంచం ఇస్తేనే పని చేసే స్థాయికి అభివృద్ధి జరుగుతోంది.
ఒక ప్రక్క నిజమైన అభివృద్ధి, మరో ప్రక్క అవినీతిలో అభివృద్ధి…. ఇదీ మన దేశ వైవిధ్య చిత్రం. అయితే అభివృద్ధి ఫలాలన్నీ సామాన్యులకు అందుతున్నాయా అంటే లేదనే చెప్పాలి. నిజంగా అందితే 75 యేళ్ళ తర్వాత కూడా సంక్షేమ పథకాల అవసరం ఉండదేమో ! ఈరోజు మనకేం కావాలి అన్న విషయం దృష్టిలో పెట్టుకోకుండా, భవిష్యత్తులో దేశం అభివృద్ధి చెందాలంటే కావాల్సినదేమిటి అన్న విషయం ఆలోచించడం మానేసి, గడచిపోయిన వాటిని తవ్వుకుని ప్రయోజనమేమిటి ? ప్రలోభాలకు లొంగకుండా అవినీతి పరులను, స్వార్థ పరులను గుర్తించి వారిని దూరంగా ఉంచడం ఎంతైనా ఆవశ్యకం. గత అనుభవాల పునాదుల మీద క్రొత్త భవనం నిర్మించుకుంటే మంచిదనే విషయం గ్రహించడం మంచిది. అప్పుడే ‘ సామాన్యుడు ’ అనేవాడు ఉండడేమో! మన దేశం ‘ స్వర్ణ భారతం ’ అవుతుంది.
.
******************************************************************************************
.
కరోనా జాగ్రత్తలు పాటించండి. మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి.
ఇంట్లోనే ఉండండి….. సురక్షితంగా ఉండండి.
మనవి : ” శిరాకదంబం అమెజాన్ పేజీ ” లో మీకు కావల్సిన చాలా వస్తువులు దొరుకుతాయి. మీకు కావల్సిన వస్తువుల మీద క్లిక్ చేసి ఆర్డర్ చేయండి. అలాగే ప్రతి పేజీలో ‘ అమెజాన్ ’ లో దొరికే వస్తువుల లింక్ లు ఉంటాయి. వాటిలో మీకు అవసరమైన వాటిని ఆ లింక్ క్లిక్ చేసి కొనుగోలు చేయండి. తద్వారా ‘ శిరాకదంబం ’ కు సహాయపడవచ్చు.
కృతజ్ఞతలు
ఇటీవల ఇచ్చిన పిలుపు కి స్పందించి ‘ శిరాకదంబం ’ క్రొత్తగా చందాదారులుగా చేరిన… చేరుతున్న వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
చందా వివరాలకు Menu లో ఉన్న subscription form ( link ) చూసి, వివరాలు పూర్తి చేసి ( Submit ) పంపండి. ఒక సంవత్సరానికి : భారతదేశంలో ₹. 600/- విదేశాల్లో $. 10 ; రెండు సంవత్సరాలకు : భారతదేశంలో ₹. 1000/- విదేశాల్లో $. 15. జీవితకాలం : భారతదేశంలో ₹. 10000/- విదేశాల్లో $. 150.
మీ మిత్రులను, బంధువులను కూడా చందాదారులుగా చేర్పించండి.
Please Subscribe & Support
మీ చందా Google Pay UPI id : sirarao@okaxis
( ఇది url లింక్ కాదు ) కు పంపించవచ్చు.
అలాగే paypal.me/sirarao కు కూడా పంపవచ్చు.
వివరాలకు editor@sirakadambam.com / editorsirakadambam@gmail.com
‘ శిరాకదంబం ‘ పత్రికకు చందా కట్టడానికి –
Or use G Pay UPI ID : sirarao@okaxis ( Please note this isn’t a url link )
or Click here –> paypal.me/sirarao