12_004AV సింహనందిని

ప్రేంఖిని నాట్యం గా ప్రసిద్ధికెక్కిన ఆలయ నృత్యాలు – “ సింహనందిని, మయూర కౌతమ్, మహాలక్ష్మి ఉద్భవం ”. ప్రాచీన కాలంలో ఆలయాల్లో ఉత్సవాలు జరిగే సమయంలో ఆలయ నృత్య కళాకారులు రధోత్సవ సమయంలో రధం బయిల్దేరుతుండగా ఆ రధం ముందునృత్యం చేస్తూ కాలితో, రంగుల పొడి ని జల్లుతూ ఆ ఆలయంలో ఉండే దేవతా మూర్తి యొక్క వాహన రూపాన్ని చిత్రీకరించేవారు. “ సింహనందిని ” నృత్యంలో దుర్గామాత వాహనమైన సింహాన్ని, “ మయూర కౌతమ్ ” నృత్యంలో కుమారస్వామి వాహనమైన నెమలిని, “ మహాలక్ష్మి ఉద్భవం ” నృత్యంలో లక్ష్మీదేవి ఆసనమైన కమలం ఆకారాన్ని చిత్రీకరిస్తారు.

కీ. శే. సి. ఆర్. ఆచార్య ఆలయ సంప్రదాయ నృత్యాలపై విశిష్టమైన పరిశోధన చేసి, దాదాపుగా కనుమరుగైపోయిన ‘ ప్రేంఖీని నాట్యాన్ని ’ వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ మూడు నాట్యరీతులు ప్రేంఖీని నాట్యం లోనివే. అరుదైన ఈ నాట్యరీతులను నేర్పించగల ప్రపంచం మొత్తానికి ఒకే ఒక గురువు ఆచార్య గారు. ప్రస్తుతం వారి కుమార్తె శ్రీమతి వోలేటి రంగమణి గారు ఒక్కరే ఈ నాట్య రీతుల్ని దేశ, విదేశాలలో నేర్పిస్తున్నారు. వారి శిష్యురాలైన అచ్యుత మానస గారు ఈ నృత్యాలను ప్రదర్శిస్తున్నారు.

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాలను ఆయా అంశాల క్రింద ఉన్న

‘ Leave a reply ‘ box లో తెలియజేయండి. 👇🏾