12_004AV

.

ప్రస్తావన

.

ఇరవైవ శతాబ్దం ఉత్తరార్థంలో బుడి బుడి అడుగులతో ప్రారంభమయిన సాంకేతిక విప్లవం గత రెండు దశాబ్దాలుగా పరుగునందుకుంది. చేతివ్రాతతో పుస్తక ప్రచురణ నుంచి, డిజిటల్ ముద్రణ వరకు సాగిన ఈ ప్రస్థానంలో పత్రికలు కూడా అన్ని దశలు చూశాయి. గోడ పత్రికలు, చేతివ్రాత పత్రికలు నుండి ఇప్పటి అంతర్జాల పత్రికల వరకు ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ముద్రణా రంగంలో కూడా అనేక మార్పులు వచ్చాయి. ఒకప్పుడు రంగుల చిత్రాలు ముద్రించడానికి దక్షిణ భారతంలో ‘ శివకాశి ’ పట్టణం అగ్రగామిగా ఉండేది. ఇప్పుడు ఎక్కడైనా ముద్రించుకునే సౌకర్యం వచ్చింది. సాంకేతిక అభివృద్ధికి మూలంగా కంప్యూటర్ ఆవిష్కరణ, అంతర్జాలం ఆవిర్భావం అని చెప్పుకోవచ్చు. మొదటి తరం కంప్యూటర్ల నుండి ఇప్పటివరకు ఎన్నో ఆవిష్కరణలు జరిగాయి…. జరుగుతున్నాయి. ఫలితంగా ఒకప్పుడు ఎంతో దూరంలో ఉన్నాయనుకున్న దేశాలు ఇప్పుడు దగ్గరై పోయాయి. దీనికి దోహదం చేసింది అంతర్జాలం.

అంతర్జాల ప్రభావంతోనే సోషల్ మీడియా వచ్చింది. ఫలితంగా స్నేహ వారధులు పెరిగి క్రొత్త స్నేహాలు పుట్టుకొచ్చాయి. వ్యాపారాలు, వ్యవహారాలు….  చివరికి రాజకీయాలు అన్నిటికీ ప్రస్తుతం సోషల్ మీడియా నే వేదిక అయింది. పావురాల నుంచి ప్రారంభమయిన సమాచార వ్యవస్థ పోస్ట్ కార్డ్, టెలిఫోన్, టెలిగ్రామ్, స్పీడ్ పోస్ట్, కొరియర్ వంటి ఎన్నెన్నో దశలు దాటి సోషల్ మీడియా వరకు వచ్చింది. మెసేజ్ఆప్స్ తో క్షణాల్లో క్షేమ సమాచారాలు వగైరా ప్రపంచంలోని మూల మూలకు చేరిపోతున్నాయి. వార్తా పత్రికలు అన్ని ప్రాంతాలలోని సమాచారాన్ని అందిస్తూ ఉండేవి. రవాణా సదుపాయాలు సరిగా లేని రోజుల్లో రెండు మూడు రోజుల తర్వాత తెలిసినా తర్వాత కాలంలో సదుపాయాలు పెరిగి మరుసటి రోజుకి తెలుస్తోంది. ఈ దృష్ట్యా రేడియో ప్రాముఖ్యం పెరిగింది. ప్రపంచంలో ఏ సంఘటన జరిగినా ఆరోజే ఆ సమాచారాన్ని రేడియో అందించేది. తర్వాత టీవీ వచ్చాక దృశ్య ప్రాధాన్యం పెరిగింది. కేవలం రేడియో, సినిమా మాత్రమే వినోద సాధనాలుగా ఉన్న దశ నుంచి టీవీ కొన్ని విప్లవాత్మకమైన మార్పులు తెచ్చింది. ఇంకా ఎన్నో సాంకేతిక విప్లవ ఫలితాలు మనందరం అనుభవిస్తున్నాం. ఇదంతా సాంకేతిక అభివృద్ధికి ఒక వైపు మాత్రమే !

సాంకేతిక అభివృద్ధి సమాజానికి ఎంత ప్రయోజనం చేకూరుస్తోందో అంత నష్టం కూడా చేస్తోందని చెప్పక తప్పదు. ప్రస్తుతం సాంకేతిక నిపుణులకు ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాన్ని మెరుగు పరుచుకోవాల్సి వస్తోంది. ఇలా నైపుణ్యాలను పెంచుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తూ క్రొత్త క్రొత్త ఆవిష్కరణలను సమాజానికి అందిస్తున్న వారు అవన్నీ మంచికే ఉపయోగపడుతాయనే భావిస్తారు సహజంగా. సమాజానికి కీడు చేయాలని ఎవరూ కోరుకోరు. కోరుకున్నా వారి శాతం చాలా తక్కువ. కానీ సాంకేతికతను ఉపయోగించే వారిలో కొంతశాతం మాత్రం తమ స్వప్రయోజనాలకు, స్వార్థానికి, మోసానికి, ప్రలోభాలకు… ఇలా ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాల చెడు మార్గాలకు మళ్లిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా లో ఈ ధోరణి విపరీతంగా పెరుగుతోంది. మనకి ఇష్టం లేని, విరోధులైన వారి వ్యక్తిత్వ హననానికి ఇవి వేదికలు అవుతున్నాయి. వాటితో బాటు చరవాణి లలో దాచుకున్న సమస్త సమాచారం అనేక రకాలుగా దొంగిలించి అనేక అకృత్యాలకు పాల్పడడం మనం చూస్తూనే ఉన్నాము. ఇంకా అనేక రకాలుగా మనకెంతో ఉపయోగకారిగా ఉంటున్న ఈ పరికరాలు ఒక్కొక్కసారి ప్రాణాంతకంగా కూడా మారుతున్నాయి. నిపుణులు ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాన్ని మెరుగుపెట్టుకుంటున్నట్లే ఈ అంతర్జాల చోరులు కూడా ఎప్పటికప్పుడు తమ చోరకళ ను కూడా మెరుగు పరుచుకుంటున్నారు. ఒక మార్గం మూసుకుపోతే మరో మార్గం వెదుకుతున్నారు. ఏమార్గం దొరకకపోతే క్రొత్త మార్గం వాళ్ళే కనుగొంటున్నారు.    

పూర్వం దొంగలు దొరికిన డబ్బునో, బంగారాన్నో, వస్తువునో మాత్రమే దొంగిలించేవారు. అది కూడా ఎప్పుడో అదృష్టం బాగా ఉన్నపుడు. ఎప్పుడో దొరికిపోయేవారు. ఇప్పుడు ఈ అంతర్జాల దొంగలు ఒకేసారి కొన్ని వేలమందిని ఒకేసారి దోచుకుంటున్నారు. పైగా వారిని పట్టుకోవడం చాలా కష్టంగా ఉంటోంది. అలాగే కొందరు ఇతరులను హేళన చెయ్యడానికి, కించపరచడానికి ఈ సోషల్ మీడియా ను ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు రాజకీయ పార్టీలకు తమ ప్రచారానికి ఈ మీడియా నే ప్రధాన వేదిక అయిపోయింది. అయితే తమ పార్టీ గురించి నాయకుల గురించి చెప్పుకునేది తక్కువ. ఇతర పార్టీలను, నాయకులను దూషించేది ఎక్కువ అయిపోయింది.

ప్రతి నాణేనికీ బొమ్మ బొరుసు ఉన్నట్లే ప్రతి మనిషి లోనూ మంచి, చెడు రెండూ ఉంటాయి. అయితే సోషల్ మీడియా ప్రారంభించిన వాళ్ళ ఆశయం మంచిదైనా, దాన్ని ఉపయోగించే వాళ్ళు కూడా మంచి కోసమే ఉపయోగిస్తే సమాజ పురోభివృద్ధికి ఉపయోగపడుతుంది. సోషల్ మీడియా ను ఉపయోగించేవాళ్లు అందరూ ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకే ఉపయోగించడం వలన కొంతవరకు మోసాల నుంచి తప్పించుకోవచ్చు. సోషల్ మీడియా లో వచ్చే అసభ్యకరమైన, హింసాత్మకమైన అంశాలను వీలైనంతవరకు మనం చూడకుండా ఉండటం మంచిది. వాటి ప్రభావం పెద్దల మీద కూడా కొంతవరకు ఉంటుంది. పిల్లల విషయంలో అయితే పూర్తి నియంత్రణ చాలా అవసరం. ఇది తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది. మన పిల్లలు మనకే కాదు… సమాజానికి కూడా మంచి చేసేలాగా పెంచడం మన కర్తవ్యం.            

       

******************************************************************************************

.

 
 

కరోనా జాగ్రత్తలు పాటించండి. మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి.

ఇంట్లోనే ఉండండి….. సురక్షితంగా ఉండండి.

మనవి :శిరాకదంబం అమెజాన్ పేజీ ” లో మీకు కావల్సిన చాలా వస్తువులు దొరుకుతాయి. మీకు కావల్సిన వస్తువుల మీద క్లిక్ చేసి ఆర్డర్ చేయండి. అలాగే ప్రతి పేజీలో ‘ అమెజాన్ ’ లో దొరికే వస్తువుల లింక్ లు ఉంటాయి. వాటిలో మీకు అవసరమైన వాటిని ఆ లింక్ క్లిక్ చేసి కొనుగోలు చేయండి. తద్వారా ‘ శిరాకదంబం ’ కు సహాయపడవచ్చు. 

కృతజ్ఞతలు

ఇటీవల ఇచ్చిన పిలుపు కి స్పందించి ‘ శిరాకదంబం ’ క్రొత్తగా చందాదారులుగా చేరిన… చేరుతున్న వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

చందా వివరాలకు Menu లో ఉన్న subscription form ( link ) చూసి, వివరాలు పూర్తి చేసి ( Submit ) పంపండి. ఒక సంవత్సరానికి : భారతదేశంలో ₹. 600/- విదేశాల్లో $. 10 ; రెండు సంవత్సరాలకు : భారతదేశంలో ₹. 1000/- విదేశాల్లో $. 15. జీవితకాలం : భారతదేశంలో ₹. 10000/- విదేశాల్లో $. 150.


మీ మిత్రులను, బంధువులను కూడా చందాదారులుగా చేర్పించండి.

Please Subscribe & Support


మీ చందా Google Pay UPI id : sirarao@okaxis

( ఇది url లింక్ కాదు ) కు పంపించవచ్చు.

అలాగే paypal.me/sirarao కు కూడా పంపవచ్చు.

వివరాలకు editor@sirakadambam.com / editorsirakadambam@gmail.com

‘ శిరాకదంబం ‘ పత్రికకు చందా కట్టడానికి –

           

Or use G Pay UPI ID : sirarao@okaxis ( Please note this isn’t a url link )

or Click here –> paypal.me/sirarao

Please visit

సాహిత్య శారదీయం
– శిరాకదంబం పేజీ