12_005 బాలభారతి – చంద్రలోక యాత్ర

 

చంద్రలోకానికే వెడతాను !

చంద్రునికి నే విలువ కడతాను !

 

అమృతమె ఉన్నదో హాలహల మున్నదో

ముందుగా నే చూచి వస్తాను !

అందఱికి నే చెప్పివేస్తాను !

 

క్యూలోన నిలబడేఇక్కట్లు లేకుండ

టిక్కెట్టు ముందుగా పుచ్చుకొంటాను

ఆౘ౦దమామలో అమ్మాయితో కలసి

హాయిగా తీయగా ఆడుకొంటాను !

 

పిల్ల నిస్తా నన్నమామయ్య నడిగి నే

కట్నముగ ఒక అపోలో పుచ్చుకుంటాను

పెళ్లివేడుక లన్ని పూ ర్తి  యై పోగానె

ఆపిల్లతో చంద్రు చూచివస్తాను !!

 

చంద్రలోకానికే వెడతాను !

చంద్రునికి నె విలువ కడతాను !!    

👉🏾ఈ అంశంపై మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (Leave a reply box) లో తెలియజేయండి👇🏾