నాకు సాహిత్య, సంగీతాల్లో ఎటువంటి ప్రవేశం లేదు. అందుచేత సప్తపర్ణి గురించి నేను వ్రాసేది కేవలం నా స్పందన తప్ప సమీక్ష కాదు. నేను ఎప్పటి నీ రచనలలో లాగ తాత్త్విక భావాల కోణం లోనే చదివాను, ఆనందించాను. అవే నీతో పంచుకుంటున్నాను.
- వెలుగులోకి : చాలా లోతైన భావ వ్యక్తీకరణ.కొన్నిసార్లు చదవడం ఆగి నాలోకి నేను వెళ్లేలాగ చేసిన తాత్త్వికత. ‘ఇరవై నాలుగు వంకరలు పోయే మనసు’ ఎన్ని విక్షేపాలను కలిగిస్తుంది!!!! ‘ ప్రస్తుతానికి కాలాన్ని తారీఖుల పరం చేసి ‘ how subtly divided the chronological and psychological time. సత్ ని గుర్తించటమెలా? నిరంతర సాధనే మార్గం. సూటి సమాధానం.’మనకన్నా మన జీవితం పెద్దదని గ్రహించాలి’. అంతులేని అంతర్మథనం…. ‘పదివేల మైళ్ళ దూరం లో వున్న…… నువ్వు వింటున్నావు… Yes conscious speaks to conscious! భాజ్యం పూర్ణం లో లీనమయిందా! ‘మన పాట మనసు కి దగ్గర…. మమేకమై పోవటమే ‘ శ్రోత- గాత ల అభేధ భావన కదూ! ఇలా ఎన్నో ఎన్నెన్నో…
కధా వస్తువు: From my own similar experiences I analysed that it’s the convictions of conditioned mind that made me to react than accept and respond. If I be the Sakshi, no bedhabhavana…no good or bad that’s relative. Only thing to avoid the reaction is ఉపేక్ష.
- ప్రయాణం: మొదట చదవగానే నవరసాలతో కూడిన జీవన ప్రయాణం.సందేహం, భయంతో ఆరంభమై ప్రేమతో ఆనందం తో పూర్తి అయ్యింది అనుకున్నాను.కానీ ఇంకా ఏదో మిగిలి ఉంది అనే భావన. మరొకసారి చూస్తే వసుదైవ కుటుంబం.. వైవిధ్యంగా ఉండే మనుషులు, మతాలు, రాజకీయాలు, సంస్కృతులు, అభివృద్ధులు, వాతావరణమార్పులు… అన్ని కలిపి ఒకటే ప్రపంచం. ఇందులో మంచి చెడు ప్రసక్తి లేదు. ఎంత బాగా చెప్పావు శారదా!
- రాగి చెంబు: This is ultimate. నేను దీనిని మీ మామయ్య పట్ల నీకున్నsentiment గుర్తించినా ఆ కోణానికి ప్రాధాన్యత ఇవ్వలేదు.’మాటలు లేకపోయినా ఫరవాలేదు అనిపిస్తోంది ‘. అవును. హృదయాలు మాట్లాడేటప్పుడు భావాతీత స్థితి ఏర్పడుతుంది. రాయాలి అంటే ఇందులో ప్రతి పేరా కి రాయొచ్చు. కానీ నన్ను కుదిపింది మాత్రం రాస్తున్నాను. ‘ఈ రాగిచెంబులో కేవలం ఈ నీళ్ళే కాదు. ‘రాగి చెంబు’ ఆత్మ స్థానం. ఆత్మయందు జీవులనన్నీ ( అన్ని సముద్రాల నీళ్లు) చూడగలిగే విరాట్రూపం…స్వస్వరూపం.
‘దీపాల వెలుగుల్లో వందల వందల రాగిచెంబుల్లా…’ అన్ని జీవులయందు ఆత్మ దర్శనం…విశ్వరూపం. ఇది చాలు నీ తాత్విక జిజ్ఞాస స్ధాయి తెలపటానికి. నేను నీలోని పూర్ణత్త్వాన్ని నాలో నింపుకున్న అనుభూతి పొందాను.
- స్వేచ్ఛ: ఇది సంస్కృతి తేడాలతో ఇల్లు దాటిన ప్రతి వ్యక్తికిఎదురయ్యే అనుభవం. ‘దుమ్ము మీద పడకూడదు అని గుర్తుంచుకో చాలు ‘. ఎన్ని రకాల దుమ్ములు….. చెడు అలవాట్లు, ఆలోచనలు, ద్వందాలతో సంఘర్షణలు… అన్నిటి నుండి వివేకాన్ని తట్టిలేపేది అమ్మమ్మ మాట.
తన శాంత మాత్మలో తగిలినపుడు కదా…..’ శాంతి ప్రశాంతి గా, జ్ఞానం ప్రజ్ఞానం అయేవేళ !!! వివేకాన్ని ప్రజ్ఞానం వరకు చూపించావు. అద్భుతం.
- మహామత్స్య: ఉపనిషత్తుల సారం. నాకు అర్ధం అయినది తప్పు అయితే correct చెయ్యి.
‘ఉత్తరార్ధం లో ఉంటుందనీ అప్పుడప్పుడు స్ఫురణకి వచ్చినా’ వేదాల లో కర్మ ప్రధానం అయిన పూర్వార్ధం, జ్ఞానం / మోక్షం ప్రధానం అయిన ఉత్తరార్ధం గురించి అనుకుంటున్నాను.
గొళ్ళేలు బంధాలు కదా? ‘ఆ గోడ- ఆ గడప- ఆ తలుపు- ఆ గొళ్ళెం’ అవిద్య – కామం- కర్మ- కర్మ ఫల బంధం అనుకోవచ్చా? అవి ‘తనకి బయటి ప్రపంచానికి మధ్య లేవు. తనకి తన లోపలున్న ప్రపంచానికి మధ్యనున్నాయి’. జీవుడు / పురుషుడి కి జగత్/ ప్రకృతి కి మధ్య లేవు కాని అహంకారానికి ఆత్మ కి మధ్య ఉన్నాయి అనేనా? సాధ్యం ముమ్మాటికీ సాధ్యం…..చాలా ప్రేరణ కలిగించింది. ‘ఎక్కడుంది తురీయం? జాగ్రదవస్ధ కి చివరలో…..’ నేను తురీయాన్ని. నేను భూమికగా మూడు అవస్థలు. చాలా బాగా వివరించావు మాలాంటి వారికి అర్థం అయ్యేలా. ‘కనటం, తెలియటం మానాలి’ అవును. Sat is beyond seeing and knowing. అనుభూతి మాత్రమే కదా!
- ఆవాహన : ‘ వస్తూ పుస్తకం అంతా నింపుకుని వచ్చావు’. నిజం. open mind లేకపోతే విషయం ఎక్కదు. మనసునిండా వాసనలు, ఊహలతో ఏర్పరచుకున్న అభిప్రాయాలు.
‘నమ్మకం, విశ్వాసం, భక్తి, ఆశ వలన’. కానీ నా అభిప్రాయం వేరు. ఈ నాలుగింటి ముందు ‘ మూఢ’ అనే విశేషణం చేరి వెర్రితలలు వేస్తోంది. No logic or reason nor even the mindfulness.
- నా దృష్టి లో ప్రేమ అంటే వేరే విధంగా ఉంది.స్వార్థం, నిస్వార్థం.అమ్మ ప్రేమ నిస్వార్థం. ఇంకేదీ దానికి సాటి రాదు. భార్యాభర్తల ప్రేమ లో స్వార్థం వుంటుంది. ఈక్ష, అపేక్ష వుంటాయి. కామన వుంటే పరిపూర్ణ ప్రేమ అనగలమా?
ఆలోచనలు అవాక్కైనప్పుడు కళ్ళలో చూపులు కూడా స్థంభించిపోతాయి. మనదనుకునే మన సొత్తు అవే కదా ! ఇక ప్రకటనకి అవకాశమేదీ ? నీ స్పందన విశ్లేషణ చదివిన తర్వాత నేను వ్రాయటం నా అహంకారమే నని స్పష్టమయింది. ఎదురుగా ఉంటే నమస్కారమైనా పెట్టేదానిని లేదా ప్రేమపుటాలింగనమైనా ఇచ్చేదానిని. నాకు నా జీవితంలో ఇంతటి భవ్యమైన చెలిమి వెలుగుందన్న భావన అణకువ నేర్పుతోంది. నువ్వు చిన్న నాటినుంచీ అందమైన ఆశ్చర్యానివే ! నీ ఆలోచనలలో దఘ్నత ఈదులాటకి అందేది కాదు. Microscope లో Zoology slides చూసినా, కథ చదివినా సునాయాసంగా అట్టడుగుదాకా వెళ్ళగల సునిశిత ఏకాగ్రత నీది. ఋగ్వేదంలో మంత్రం మరోసారి. మూల మంత్రం మరోసారి చెప్తాను
“ I love you not because how wonderful you are, but because how wonderful I feel about myself when I am with you ” – ఇదే కదూ ప్రేమన్నా స్నేహమన్నా !
————————————————————-
సప్తపర్ణి కథలకి ఇంతకు మించిన అద్భుత సాహిత్య విమర్శ ఉండదు. నీ భావ ప్రకటన నేను ఊహించని అపురూప సన్మానం ! నీ అనుమతితో పాఠకలోకంతో పంచుకుంటాను. Gratefully yours ప్రేమతో – పూర్ణ
———– ( 0 ) ———–
Please visit this page