ఆటలు ఆడాలి ! బాలలు
పాటలు పాడాలి !
ఆటల పాటల పోటీ చేయుచు
మేటిగ నిలవాలి !
చదువులు చదవాలి ! పెద్ద
పదవులు గెలవాలి !
పదవులు పొంది ప్రజాసేవలో
ప్రథములు కావాలి !
కండబలముతో గుండెబలముతో
దండిమగల మనిపించాలి !
నీతికి నిలబడి నిజాయితీతో
జాతిపేరు నిలబెట్టాలి !
తల్లిదండ్రులను ఎల్లగురువులను
దైవములుగ పూజించాలి !
జననియుప్రియతమజన్మభూమియును
స్వర్గధిక మని తెలియాలి !
——- ( 0 ) ——-
👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾
Please visit this page