12_008 నిర్గుణ్ కబీర్ భజన్

మహాకవి కబీర్ దాస్ రచించిన గొప్ప ఆధ్యాత్మిక రచనలో ఇది ఒకటి. దీనికి స్థూలమైన అర్థం దిగువన ఇస్తున్నాను. 

ఈ భజనను రవీంద్ర భవన్, భోపాల్ లో ఆహూతుల సమక్షంలో ఆకాశవాణి, భోపాల్ వారు నిర్వహించిన “హిందీ కవితా కే సోపాన్” అనే కార్యక్రమంలో పాడే సద్భాగ్యం నాకు లభించింది. అదే అర్థంతో సహా మీ ముందుంచుతున్నాను. 

“హిందీ కవితా కె సోపాన్” అనే పేరుతో ఆకాశవాణి, భోపాల్ వారు ఒక పెద్ద కార్యక్రమాన్ని రూపొందించి 

అందులో భాగంగా ఒక రోజున “నిర్గుణ కవితలు” అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నిర్గుణ భజనల్లో

కేవలం భగవంతునిగా భావించే అన్ని సద్గుణాలు, జీవన ధర్మాలు, సత్యాలు వివరించబడ్డాయి. ఈ విధమైన ప్రధాన భజనలు చాలామంది మహాకవులు రచించినప్పటికీ, కబీర్ భజనలు మకుటాయమానంగా ఉండటానికి కారణం, వారి రచనల్లో అన్ని మతాల లోనూ ఉండే లొసుగులను కూడా నిర్భయంగా ప్రజలకు తెలియచెప్పటమే. 

ఈ మాటు ఇస్తున్న ఈ భజనలో బ్రహ్మాండంలో గల “నిశ్శబ్ద సంగీతం” ఏ విధంగా మానవ శరీరంలో కూడా నిక్షిప్తమై ఉంటుందో చక్కగా వివరిస్తుంది. 

” భగవంతుడనే అమృతం నిశ్శబ్ద ధ్యానం నుంచి ఉద్భవిస్తుంది. వాయిద్య, గాత్రాలు లేని ఈ సంగీతమే నిశ్శబ్ద గానం. 

మనసనే ఈ పవిత్ర వనంలో నీరు లేకుండానే కమలం (మెదడు) వికసిస్తుంది, హంసలు (ప్రాణం) విహరిస్తాయి.  

మనసుకోరే స్వాంతన ధ్యానంలోనే లభిస్తుంది. అట్టి సమయంలోనే, భగవత్సాక్షాత్కారం కలుగుతుంది.”

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

——– ( 0 ) ——-

Please visit this page