త్యాగరాజ విరచిత ఉత్సవ సాంప్రదాయ కీర్తన
రాగం : ఆనందభైరవి
తాళం : ఆది
రామ రామ నీవారము గామా రామ సీతా
రామ రామ సాధు జన ప్రేమ రారా
- మెరుగు చేలము కట్టుక మెల్ల రారా రామ
కరగు బంగారు సొమ్ములు కదల రారా (రామ) - వరమైనట్టి భక్తాభీష్ట వరద రారా రామ
మరుగు జేసుకొనునట్టి మహిమ రారా (రామ) - మెండైన కోదండ కాంతి మెరయ రారా కనుల
పండువగయుండు ఉద్దండ రారా (రామ) - చిరు నవ్వు గల మోము జూప రారా రామ
కరుణతో నన్నెల్లప్పుడు కావ రారా (రామ) - కందర్ప సుందరానంద కంద రారా నీకు
వందనము జేసెద గోవింద రారా (రామ) - ఆద్యంత రహిత వేద వేద్య రారా భవ
వెద్య నే నీవాడనైతి వేగ రారా (రామ) - సుప్రసన్న సత్య రూప సు-గుణ రారా రామ
అప్రమేయ త్యాగరాజునేల రారా (రామ)
👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾
——– ( 0 ) ——-
Please visit this page