12_010 సునాదసుధ – నమో నమో రఘుకుల నాయక

 

రాగం: నాట్ట

తాళం : రూపక

అన్నమయ్య పాటలు

గానం : విద్వాన్ అరవింద్ సుందర్

 

నమో నమో రఘుకుల నాయక దివిజవంద్య

                 నమో నమో శంకరనగజానుత                     // పల్లవి //

 

విహితధర్మపాలక వీరదశరథరామ

గహనవాసినీ తాటక మర్దన

అహల్యా శాపవిమోచన అసురకులభంజన

                    సహజవిశ్వామిత్రసవనరక్షకా                     // నమో //

 

హరకోదండహర సీతాంగనావల్లభ

ఖరదూషణారి వాలిగర్వాపహ

తరణితనూజాది తరుచరపాలక

                    శరధిలంఘనకృత్య సౌమిత్రిసమేతా           // నమో //

 

బిరుద రావణశిరోభేదక విభీషణ –

వరద సాకేతపురవాస రాఘవ

నిరుపమ శ్రీవేంకటనిలయ విజనగర

                    పురవరవిహార పుండరీకాక్షా                   // నమో //

 

  👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

——– ( 0 ) ——-

Please visit this page