అవధాన ప్రక్రియ అనేది ఒక విశేషమైన, విలక్షణమైన సాహితీ ప్రక్రియ. బహుశా ఈ ప్రక్రియ సంస్కృత భాషలో తప్ప మరే ఇతర భాషల్లోనూ లేదని చెప్పుకోవచ్చు. ఈ అవధాన ప్రక్రియలో విరివిగా చేసేది ‘ అష్టావధానం ’. ఈ అష్టావధానంలో కవికి ప్రధానంగా ఉండవల్సినది ‘ ధారణా శక్తి ’, సర్వంకషమైన పాండిత్యము, స్పురణ, లోకజ్ఞత. ఉపజ్ఞత, పాండిత్యము కలిగిన అవధాని యొక్క అవధానం మనోరంజకంగా ఉంటుంది.
👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾
——– ( 0 ) ——-
Please visit this page
చాలా బాగా చెప్పారు అవధానం గురించి,తెలియని విషయాలు తెలిసేటట్టు వుదాహరణ ల తో శారద గారు
తెలుగు వారు ఎప్పటికీ గర్వపడవలసినది, పరిరక్షించుకోవలసినది, ఇతోధికంగా వ్యాపింపజేసుకోవలసినది అత్యంత సృజనాత్మకమైన, విశిష్టమైన, మహాశ్చర్యానికి గురి చేసే అవధాన విద్య. మహాసాగరం వంటి ఈ ప్రక్రియను, ముఖ్యంగా అష్టావధానం గురించి, గుమ్మతేనె వంటి సోదాహరణ ప్రసంగబిందుధారలతో శ్రోతలను అలరించిన యర్రమిల్లి శారద గారు అభినందనీయులు, అభివందనీయులు. ఇటీవలనే కడిమిళ్ళ వరప్రసాద్ గారి అవధానాలను కొన్నిటిని అంతర్జాలంలో తిలకించడం జరిగింది. ఈ నేపథ్యంలో శారద గారు ఉదహరించిన కొన్ని పద్యపాదాలు, ఉందంతాలు కమనీయమైన పునశ్చరణగా భాసిల్లాయి. సహస్రావధాని మాడుగుల నాగఫణి శర్మ గారితో నాకున్న కొంత సాహితీ పరిచయంతో కూడిన కొన్ని రచనా-అనుసృజన అనుభవాలు, అష్టావధాని “పద్మశ్రీ” ఆశావాది ప్రకాశరావు గారితో నాకున్న సాన్నిహిత్య బంధం — అవధానానికి నన్నొక వినమ్ర అభిమానిగా చేసాయి. అవధానం సదా విజయోస్తు! దిగ్విజయోస్తు!
అవధానం గురించి తెలియని వారికి కూడా తెలిసే తట్లుగా వివరంగా చెప్పారు.అభినందనలు.