శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు సంగీత స్వరాలు కూర్చిన ముఖారి రాగం, ఆది తాళం లోని భద్రాచల రామదాసు కీర్తన ‘ దశరధ రామ ’….
దశరథ రామ గోవిందా నను దయజూడు పాహి ముకుంద !
దశ ముఖ సంహార ధరణీజాపతి రామ శశిధర పూజిత శంఖ చక్రధర ||
మీ పాదములే గతి మాకు మమ్ము ఏలుకో స్వామి పరాకు మాపాల
గలిగిన శ్రీపతి ! ప్రొద్దు కాపాడి రక్షించు కనకాంబరధర ||
నారాయణ వాసుదేవ నిను నమ్మితి మహానుభవ గరుడ
గమన హరి గజరాజ రక్షక పరమ పురుష భక్త పాప సంహరణ ||
తారకనామ మంత్రము రామడౌలకెల్ల స్వతంత్రము ఇరవుగ
కృపనేలింపుడు భద్రాద్రిని స్థిరముగ నెలకొన్న సీతా మనోహరా ||
**********************************
👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾
——– ( 0 ) ——-
Please visit this page