12_011 కొత్త కిరణం

భారత చలన చిత్ర రంగం ప్రారంభ దశలో ఒకే గొడుగు క్రింద ఉండేదని మన చరిత్ర చెబుతోంది. అంటే భాషల వారీగా విడిపోలేదు. ఎందుకంటే అప్పటి సినిమాలకు భాష లేదు. అవి శబ్ద రహిత మూకీ సినిమాలు. తర్వాత కాలంలో శబ్దం జోడించడం జరిగినా మొదట్లో సాంకేతిక అంశాల పైన అవగాహన, నైపుణ్య లేమి వలన అన్ని ప్రాంతాల వారు ఒకే చోట కలసి పనిచెయ్యడం జరిగేది. ఆ నైపుణ్యాలను పెంచుకున్నాక ఆయా ప్రాంతాలలో స్థానిక భాషలలొ చిత్ర రంగాల అభివృద్ధి జరిగింది. అప్పటినుంచి ఇటీవల వరకు భారత చలన చిత్ర రంగంలో ఒక్క హిందీ చిత్రాలు మాత్రమే దేశమంతా విడుదల కావడం జరిగేది. ప్రాంతీయ భాషా చిత్రాలు ఆయా ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యేవి. ఇతర ప్రాంతాల వారికి ఇతర భాషల చిత్రాలు చూసీ అవకాశం చాలా చాలా తక్కువగా ఉండేది, కొన్ని డబ్బింగ్ చిత్రాలు తప్ప. అయితే ఇటీవల వచ్చిన ‘ పాన్ ఇండియా ’ అనే క్రొత్త భావన వలన ప్రాథమికంగా ఏ భాషలో తీసినా…. చాలా చిత్రాలు వేరే భాషల్లో కూడా విడుదల అవుతున్నాయి. ఒక ప్రాంతానికి, ఒక భాషకి పరిమితమవడం తగ్గిపోతోంది. సాంకేతిక అభివృద్ధి దీనికి చాలా దోహదం చేసింది. ఏమైనా మళ్ళీ ‘ భారతీయ చిత్రం ’ అనే భావన మళ్ళీ వెలుగులోకి వచ్చింది.

ఇటువంటి పరిస్థితుల్లో సినిమా థియేటర్ లలోనే కాకుండా ఓ‌టి‌టి లలో కూడా చిత్రాలు విడుదల అవుతూ మన డ్రాయింగ్ రూమ్ లోనే కాకుండా మన అరచేతిలోకి స్మార్ట్ ఫోన్ ల రూపంలో సినిమాలు వచ్చేశాయి. అందులోనూ పూర్తి నిడివి చిత్రాలే కాకుండా, లఘు చిత్రాలు కూడా విరివిగా వస్తున్నాయి. అలాగే నటులు, సాంకేతిక నిపుణులు కూడా ఒక ప్రాంతానికి, ఒక భాషకి పరిమితం కావడం లేదు. ఇది ఎంతోమంది కొత్తవారికి అవకాశాలు కల్పిస్తోంది.

ప్రముఖ హిందీ దర్శక నిర్మాత సుభాష్ ఘయ్ కి చెందిన ‘ విజ్లింగ్ వుడ్స్ ’ ఆక్టింగ్ స్కూల్, ముంబై నుంచి ఆక్టింగ్ లో డిగ్రీ పొందిన తెలుగు వాడు, మిహీక్ రావు అనే నూతన నటుడు నటించిన కొన్ని లఘుచిత్రాలు అభియోగ్, రమ్మీ, బ్యాడ్ ఫాదర్ 2 వగైరా యూట్యూబ్ లో ఉన్నాయి. మంచి నటన, హావభావాలు కలిగిన మిహీక్ రావు హిందీ లో మాత్రమే కాకుండా అన్ని భాషలలోనూ నటించి ‘ పాన్ ఇండియా ’ నటుడిగా పేరు తెచ్చుకుంటాడని ఆశించవచ్చు.

ఈ నటుడు ఇటీవలే నటించిన లఘుచిత్రం ‘ పరిందా ’ తో బాటు, అనేక పురస్కారాలు పొందిన లఘుచిత్రం ‘ అభియోగ్ ’ చిత్రాలు…..

 

 

A B H I Y O G ( 2 0 1 8 )

AWARD WINNING SHORT FILM | Directed by Aaditya Bhardwaj

 

 PARINDA

Drama Sentimental Short Film | 2023 Short Film

 

****************************************

 

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

——– ( 0 ) ——-

Please visit this page