నాకు ఆప్తమిత్రులు, చలనచిత్ర దర్శకుడు – చిత్రకారుడు అయిన శ్రీ బాపుగారికి తమ్ముడు, ఆకాశవాణి మద్రాసు, విశాఖపట్నం తదితర కేంద్రాలలో Station Director గా పనిచేసినవారు, portrait – artist సౌమ్యశీలి అయిన శ్రీ శంకరనారాయణ గారు. నేను లండన్, చికాగో నగరాలలో ఉంటూన్న మా అబ్బాయిల వద్దకు వెళ్ళిన సందర్భంగా ఆయన మనసులో ఒక గొప్ప ఆలోచన రూపు దిద్దుకుని దానిని నాతో పంచుకున్నారు….
తాను portrait artist గా ఎంతో నేర్పుతో వేసిన చిత్రాలలో ప్రత్యేకించి Queen Elizabeth, Prince Charles చిత్రాలు చెప్పుకోదగ్గవి.
వాటిని లండన్ నగరంలోని వారిచిరునామాకి పోస్ట్ పంపుతూ ప్రతిగా వారి స్పందనతో ఉన్న ఉత్తరాన్ని సంపాదించాలని…
నేను ఆయన సలహాను వెంటనే ఆమోదిస్తూ ఆయన నాకు పంపిన portrait sketch కి Prince Charles కి వ్రాసిన ఉత్తరాన్ని జోడిస్తూ, చిరునామాని సంపాదించి దానిని Buckingham Palace కి పంపడం ఒక అపూర్వమైన, అందమైన అనుభవం.!
ఈ సంఘటన జరిగిన వారం, పది రోజులకు నాకు అక్కడనుండి సమాధానం రావడం ..
ఓహ్….!
అంతులేని ఆనందాన్ని అందించింది..
ఆ ఉత్తరమే ఈనాడు మీ ముందు రెక్కలు కట్టుకుని వాలిన ఈ తోకలేని పిట్ట!
దయచేసి తిలకించి మీ అమూల్యమైన స్పందనను తెలియజేయవలసినదిగా కోరుతున్నాను.
ధన్యవాదాలు.
నమస్కారములు.
👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾
Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page