13_002 వాడిలో నన్ను వెదుక్కుంటూ…

దేహం చెట్టున

ఆకులు అల్లుకుంటున్న

ఆకుపచ్చ జ్ఞాపకం!

అల్లుకున్న

ఆకుల కౌగిలినుంచి

జారిపడుతున్న

రవికిరణాల వాలకం!

శ్వాసిస్తున్న ఉదయపరాగాల

సరాగంలో…

ఏదో సురవీణ

గొంతు సవరించుకున్న అలికిడి!

చెవులు రిక్కించిన

ప్రకృతిచెలమలలో

లీలగా ఓ స్వరం

ఆసాంతం మొలచిన వైనం!

నిజoచెప్పొద్దూ….

వెన్నునిమిరిన వెన్నముద్దచేయి

ఎవరిదో గుర్తుకు తెచ్చుకోడానికి

ఋతువులు దొర్లిస్తూ వెదుకుతున్నా!

స్వరాలసంతలో

తంబురామీటే

అదృశ్య హస్తం ఎవరిదా అని

కూపీ లాగుతున్నా!

దైవానికి నామీద ప్రేమ ఎక్కువ

అనుకుంటున్నా

నాకే

కనపడకుండా

నాలో

దాంకున్నాడు!

కనిపిస్తే…చడా…మడా

నమకచమకాలతో

కడిగేస్తా….!

ఢమరుక నాదంలోని

వ్యాకరణాలని

వప్పచెప్తా!

అయినా…కళ్ళకు ఆశావేశ్యల

చెంగుగంతలు కట్టుకున్న

నా యోగ్యతకి…

నాకునేనే కనపడను…!

ఇక నా ఆత్మ ఎక్కడ కనబడుతుంది!!

అయినా ఈ అన్వేషణ ఎందుకంటే..

నేను వాణ్ణే…!

వాడిలో వాణ్ణే వెదుకుతూ…..!!”

**********

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page