త్యాగరాజ కీర్తన
అసావేరి రాగం, మిశ్ర చాపు తాళం
**************
సమయము తెలిసి పుణ్యములార్జించని
కుమతి ఉండియేమి పోయియేమి
శమత తోడి ధర్మము జయమే కాని
క్రమముతో మనవిని వినవే ఓ మనసా (సమయ)
సారమౌ కవితల విని వెర్రివాడు
సంతోషపడియేమి పడకేమి
చేరెడేసి గుడ్డి కన్నులు బాగుగ
తెరచియేమి తెరవ్కుండిననేమి (సమయ)
తురక వీథిలో విప్రునికి పానక పూజ
నెరయ జేసియేమి సేయకుండియేమి
ధరనీని ధన కోట్లకు యజమానుడు
తా బ్రతికియేమి దయ్యమైననేమి (సమయ)
పదము త్యాగరాజ నుతునిపై కానిది
పాడియేమి పాడకుండిననేమి
ఏదను శ్రీ రామ భక్తియు లేని నర జన్మం-
ఎత్తియేమి ఎత్తకుండిననేమి (సమయ)
👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾
Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page