13_004 తో. లే. పి. – కె. పి. ఎస్. మీనన్

 

కె.పి.యస్.మీనన్, శ్రీమతి సరస్వతీ మీనన్ దంపతులు.

 

శ్రీ కుమార పద్మనాభ శివశంకర మీనన్- ( కె. పి. యస్. మీనన్ )

అలనాటి ప్రముఖ వ్యక్తులలో ఒకరు.

కేరళ ( ట్రావెన్కూర్) రాష్ట్రంలో 1898 వ సంవత్సరంలో జన్మించిన ఆయన తన విద్యాభ్యాసాన్ని సి.యమ్.యస్.స్కూల్, కొట్టాయం లోను, మద్రాసు క్రిష్టియన్ కాలేజి లోనూ సాగించి అటు పిమ్మట ఆక్స్ ఫర్డ్ లో హిస్టరీ విభాగంలో చేరి అందులో ప్రధమ స్ధానంలో ఉత్తీర్ణతను సాధించారు. అప్పట్లో ఆయనకు సమకాలికుడు బ్రిటిష్ ప్రధాని అయిన సర్ ఏంటోనీ ఈడెన్. మీనన్ 1921 లో అతి పిన్న వయసు లో, అంటే తన 23 వ ఏటనే Indian Civil Service ( ICS ) లో చేరారు. తొలుత మద్రాసు ప్రెసిడెన్సీ లో చేరి పనిచేసి, అటు తరువాత కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ లోనూ పని చేసారు. ఈ విభాగానికి ఎన్నికైన ప్రధముడు ఈయనే. బెలూచిస్ధాన్‌, హైదరాబాద్, రాజపుటానాలలోనూ, కేంద్ర సచివాలయం లోనూ ఆయన తన విధులను నిర్వహించారు.

1929 నుండి 1933 వరకూ శ్రీలంక లో Agent of the Government of India గానూ, 1934 లో జాంజిబార్, తూర్పు ఆఫ్రికా లోనూ తమ విధినిర్వహణ గావించారు. 1943 లో భార్య, కుమార్తెలను వెంటబెట్టుకుని ఛంగ్ కింగ్, చైనా ను చేరి అక్కడ Agent General for India గాను, త‌రువాత Ambassador గానూ పనిచేస్తూ తన యాత్రానుభవాలను జోడించి 1944 లో Delhi – Chunking అన్న పుస్తకాన్ని వ్రాసారు. 1945 లో Chief Advisor to the Indian Delegation గా San Francisco / USA లో సమావేశంలో పాల్గొన్నారు.1947 లో Chairman of the UN Commission on Korea గా వ్యవహరించారు. 1952 నుండి 1961 వరకూ రష్యా లో భారత రాయబారి గా‌‌ను, అదనంగా పోలెండు‌, హంగరీ దేశాలకు కూడా భారతదేశపు రాయబారిగా పని చేసారు.

ఇంకొక విశేషమేమంటే, రష్యా అధిపతి స్టాలిన్ ను ముఖాముఖి కలిసిన (13-2-1953 న) తొలి విదేశీ రాయబారి ఈయనే !

ఈయన తరువాతి తరంలో ఆయన పుత్రుడు అదే పేరుగలాయన శ్రీ కె.పి.యస్.మీనన్. ( జూనియర్) కూడా భారత విదేశాంగ శాఖ లో రాయబారిగానూ, తదుపరి 3 వ తరంలో ఆయన పుత్రుడు శ్రీ శివశంకర మీనన్ కూడా అదే శాఖలో రాయబారిగానూ పనిచేయడం జరిగాయి.

పదవీవిరమణ అనంతరం మీనన్ గారు స్వరాష్ట్రంలోనే స్ధిరపడి తాము ఇష్టపడే రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ వచ్చారు..తమ అభిమానరంగమయిన పర్యటనానుభవాలను క్రోడీకరిస్తూ వ్రాసిన ఆయన రచనలు కొన్ని:

Many Worlds – An autobiography

Journey round the World..1966

A Diplomat speaks..1974

Memories & Messages..1979

One thousand Full Moons ( Posthumously published ) 1987

ఒక సందర్భంలో, నేను అప్పటి ప్రముఖ వార పత్రికలలో ఒకటయిన The Illustrated Weekly of India లో ప్రచురితమైన ఆయన వ్యాసం..The God’s own Country ( Kerala ) ను చదివి ఆయనకు అభినందనలు తెలుపుతూ ఉత్తరాన్ని వ్రాయగా ఆయన వెంటనే ప్రతిస్పందిస్తూ, ఆ స్ఫూర్తితో, భావిలో ఒకనాడు నేను తప్పకుండా కేరళ ను సందర్శిస్తానని  జోస్యం చెబుతూ నాకు బదులు వ్రాసారు.

నిజమే మరి!  ఆయన జోస్యం ఫలించి, ఆ పిమ్మట నేను కేరళలోని అనేక ప్రముఖ పర్యాటక స్ధలాలను.. తిరువనంతపురం, కోవలం బీచ్, అలెప్పీ, క్విలన్, ఎర్నాకుళం, కొచ్చిన్ వగయిరాలను సందర్శించడం సంభవించింది. పర్యటన ముగిసాకా, నా పర్యటనానుభవాన్నీ‌, అది నాకు అందించిన అపూర్వ ఆనందాన్నీ ప్రస్తావిస్తూ 6-1-1982 న మీనన్ గారికి ఉత్తరం వ్రాసాను. ఆ ఉత్తరాన్ని అందుకున్న ఆయన ఎంతో ఆనందపడి, వెనువెంటనే 12-1-1982 న దానికి బదులు వ్రాసారు.. అదే ఈనాటి తోక లేని పిట్ట లలో ఒకటి. ఇక ఆయన కు జరిగిన సన్మానాల విషయానికి వస్తే… వానిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గవానిలో కొన్ని~

పద్మభూషణ్… 1958

Lenin Peace Prize..

ఇలా ఉండగా…

” జాతస్యహి మరణం ధృవమ్” అన్న మన పెద్దలసూక్తి ని అనుసరించి, శ్రీ కె.పీ.యస్. మీనన్ గారు 22-11-1982 న, ఒట్టాపలం లోని తమ స్వగృహంలో తనువు చాలించారు.. శోకపరితప్తులయిన వారి శ్రీమతి సరస్వతీమీనన్ గారికి, వారి కుటుంబానికి నా సానుభూతి ని తెలియజేస్తూ, శ్రీ మీనన్ గారి పవిత్ర ఆత్మ కు శాంతి కలగాలని కోరుతూ ఉత్తరం వ్రాయగా, దానికి వెనువెంటనే స్పందిస్తూ సరస్వతీమీనన్ గారు కృతజ్ఞతలు తెలుపుతూ నాకు ప్రత్యుత్తరం వ్రాయడం సామాన్య విషయం కానే కాదు.

ఇది వారి సౌజన్యానికి సంకేతమని చెప్పక తప్పదు. వారి ఈ ఉత్తరం నేటి మరో తోక లేని పిట్ట. దయచేసి చిత్తగించండి.

 

ధన్యవాదాలు..

నమస్కారములు. 

***************************

 

­👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page