భారతీయ శాస్త్రీయ కళలకు ముచ్చటపడి కళాఖండాలుగా మలచిన శిల్పులెందరో, వారి కళాదృష్టి, పోషకుల అభిరుచి కలగలిసేలా మన పురాతన దేవాలయాలు, రాజభవనాలు రూపొందాయి. శిల్పకళ కష్టంతో కూడుకున్నదైనా, మన సంస్కృతిలోనే పెరిగిన కొందరు ఆధునికులు కూడా ఈ కళను కొనసాగిస్తూ మన నాట్యం శివుడు, కళాకారుని వేషధారణలో కళకళలకు. తళుకులద్దుతూనే వాంగ్ పింగ్ ట్యాన్ ఉన్నారు. వీరిలో చైనాలో పుట్టి, అమెరికాలో స్థిరపడిన కనబడితే “గువాంగ్ పెంగ్ ట్యాన్ ” కూడా ఉన్నారు. ఇతర శిల్పశాస్త్రాలు నేర్చుకున్నా కాగితాలను ఉపయోగించి ముచ్చటగొలిపే బొమ్మలను తయారుచేస్తున్నారు. మన కళలకు జీవం పోస్తున్నారు. ఈ కళపై తనకు కలిగిన ఆసక్తి, శిల్పాలు మలుస్తూ సంతృప్తిని పొందుతున్న వైనాన్ని ఆయన వివరిస్తూ…
“నాకు మీ దేశం తెలియకపోవచ్చుగానీ.. మీ సంప్రదాయ శాస్త్రీయ నృత్యం మాత్రం బాగా తెలుసు. ఎలాగంటారా? ఆ విషయానికి వచ్చే ముందు కొంత నా గురించి చెప్పాలి.
నేను చైనాలో పుట్టాను. 1988లోనే మా అమ్మానాన్నలతో అమెరికా వచ్చేశాను. మా కుటుంబము అప్పటినుంచి ఇక్కడే స్థిరపడింది. ప్రస్తుతం నేను ప్రసిద్ధ సంస్థల్లో ఫ్రీలాన్స్ యానిమేటర్ గా పనిచేస్తున్నా. ఇంకొంచెం సంపాదన కోసం, పిల్లలకు సంబంధించిన భాషలపై వీడియోలు తీస్తుంటా. పొద్దున ఆల్పాహారానికి ముందు, రాత్రి భోజనం తరువాత నాకెంతో ఇష్టమైన పని చేస్తుంటాను. అదే… శిల్పకళ, నా శిల్పాలు రాతిని కాదు, కాగితంతో చేసినవి. నేను శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్శిటీలో శిల్పకళ నేర్చుకున్నా. అందులో భాగంగా దక్షిణ భారత కళకు సంబందించిన పాఠ్యపుస్తకాన్ని చదివాను. నన్నెంతగా ప్రభావితం చేసిందంటే.. ఒక క్లాస్ అసైన్మెంట్ కి నేను విష్ణుమూర్తిలా తయారయి వెళ్ళా. అది ఎంతగా నచ్చిందో చెప్పలేను. మా ప్రొఫెసరు పెద్దగా నవ్వి నువ్వు నాట్యం నేర్చుకున్నావా? అని అడిగారు, అలా దశావతారాలు, ఒక పెద్ద మనిషంత విష్ణువు శిల్పాలను రూపొందించాను. దీపాలతో అలంకరించాను.
అప్పటినుంచి భారతీయ శిల్పకళ అమిత ఇష్టంగా మారింది. పుస్తకాలు, వెబ్సైట్లు, వ్యాసాలూ పరిశోధిస్తూ వచ్చాను.
విభిన్నతే ఆకట్టుకుంది…
అలాంటి పరిశోధనే నన్ను భారతీయ శాస్త్రీయ నాట్యకళను తెలుసుకునేలా చేసింది. అబ్బో.. అది ఒక నాట్యమా! కాదే ! ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క శాస్త్రీయం, అనేక పామర నాట్యాలు. ఈ విభిన్నత నన్ను ఆకట్టుకుంది.
అందుకే వాటికి సంబంధించినవి కనబడితే చాలు… నిశితంగా గమనించకుండా వదిలిపెట్టలేదు. వాటికి కావలసిన దుస్తులు, ఆభరణాలు, భంగిమలు. అలంకరణలు.. అన్నీ తెలుసుకున్నాను. ఎందరో కళాకారుల ఆహార్యాన్ని, నాట్యాన్ని గమనించాను. కావలసిన సరంజామా సమకూర్చుకుని వాటిపై ప్రయోగాలు చేశాను. పట్టుదలగా కొనసాగించి చివరకు సాధించాను. భరతనాట్యం, కూచిపూడి, కథక్, మోహినీయాట్టం, కథకళి, మణిపురి, ఒడిస్సీ బొమ్మలు చేసేశాను. అమెరికాలోనే ఉన్న భరతనాట్యం కళాకారులు ఐశ్వర్య శుభలక్ష్మి చాలా సహకరించారు. నాట్యభంగిమలను పోలే బొమ్మలు చేసేసరికి వాళ్లు ఎంతో సంతోషించారు. నన్నెంతగానో ప్రోత్సహించారు. ఫేస్బుక్ స్నేహితులు కూడా కొత్త ఫొటోలు పోస్ట్ చేసినప్పుడల్లా చాలా మెచ్చుకుంటూంటారు. ప్రస్తుతం ఐశ్వర్యకు సంబంధించిన బొమ్మలు చేయడంలో బిజీగా ఉన్నాను.
ఇలా రూపొందుతాయి…
కార్డ్ బోర్డు, టీష్యూ పేపర్లను ఉపయోగించి బొమ్మలను చేస్తాను. అనుకున్న పరిమాణం, ఆకారం, భంగిమ కుదిరాక వాటిమీద స్కిన్ కలర్ ను స్ప్రే చేస్తా. మేకప్ రంగులేస్తాను. జడ, పువ్వులు కూడా రంగులతోనే చూపిస్తాను. సన్నని పేపర్ను జాగ్రత్తగా మడిచి వింజామరల్లా విచ్చుకునే దుస్తులను రూపొందిస్తాను. పది నుంచి పన్నెండు అంగుళాల పొడవు, ఆరు నుంచి ఎనిమిది అంగుళాల వెడల్పు ఉన్న బొమ్మలు చేయడానికి ఒకట్రెండు వారాలు పడుతుంది. శివుని బొమ్మను తీర్చిదిద్దడం కొంచెం కష్టమే!
ఈ శిల్పశాస్త్రాలూ, భారతీయ కళలూ వంటివాటిపై మా తల్లిదండ్రులకు ఏ మాత్రం ఆసక్తి లేదు. అయినా భారత శాస్త్రీయ నృత్యంతో నా భారతీయ శిల్పకళ ప్రేమాయణం కొనసాగుతూనే ఉంటుంది. ఆ నృత్యమే నా ప్రస్థానంలోని ఆటంకాలను. భయాన్ని రూపుమాపుతుందని నమ్ముతున్నా.
***************************
సంక్రాంతి ముగ్గు – తటవర్తి జ్ఞానప్రసూన
👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾
Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page