13_007 తో. లే. పి. – కెంఛో

మైత్రీబంధం ఇరువురి మధ్యన నెలకొనడానికి మూలము ఏమిటీ అంటే ఇది అని ఇదమిద్ధంగా చెప్పలేము. వాస్తవానికి ఎల్లలెరుగనిది స్నేహం. దేశం, భాష, వృత్తి‌, కులం-గోత్రాలతో దీనికి సంబంధం లేదు.

నేటికీ సుమారు 38 ఏళ్ళ క్రితం, అంటే – 1986 వ సంవత్సరంలో నాకు దక్షిణ భూటాన్ లోని ‘ గేలెగ్‌ఫగ్’ కి చెందిన కెంఛో అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆయనకు ఇద్దరు సోదరులు‌, ఇద్దరు సోదరీమణులు. వారిదొక నిరుపేద కుటుంబం. ఆర్ధికపరమయిన ఇబ్బందుల కారణంగా, 1975 లోనే తాను పదవ తరగతి చదువు పూర్తికాగానే ఇక పైచదువులకు స్వస్తి చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది. కుటుంబ పోషణ నిమిత్తమై అప్పటి టెన్త్‌క్లాస్ చదువు ఆధారంగా గేలెగ్‌ఫగ్ లోని Jurmey Bakery & Keljang Rice Mill లో కెంఛో పని చేయవలసివచ్చింది.

కుటుంబ బాధ్యతలను విస్మరించక, తన తోబుట్టువుల శ్రేయస్సును కోరి, వారికోసమై తన చదువును త్యాగంచేసి, కన్నతల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండాలన్న ఒకేఒక ధ్యేయంతో  ఆదర్శప్రాయమయిన జీవితాన్ని గడిపే కెంఛో జీవనశైలి నాకు ఎంతో ముచ్చటగొలిపింది.

తన ఈ జీవిత నేపథ్యాన్ని వివరిస్తూ‌, కెంఛో 1986 లో నాకు వ్రాసిన ఉత్తరమే ఈనాటి తోకలేని పిట్ట ! దాని వయసు కూడా నేటికి మూడున్నర దశాబ్దాలు దాటింది…! 

త్వరలో నాలుగవ పడిలో ప్రవేశింపబోయే ఈ తోలేపి సొగసులను దయచేసి చిత్తగించండి.

   *** ధన్యవాదాలు-నమస్కారములు ***

***************************

 

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page