13_008 రామచరిత మానస్

 

“ఆకాశవాణి, భోపాల్ కేంద్రం నుండి రికార్డు చేసి ధారావాహికంగా ఒక పుష్కరం పాటు ప్రసారం చేసిన తులసీకృత రామాయణం ” రామచరిత మానస్”. మానస్ గాన్ అనే పేరుగల కార్యక్రమం గా నేటికీ ఎఫ్. ఎం. గోల్డ్ లో ఇంకా ఇతర రేడియో స్టేషన్స్ నుంచి దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా ప్రతిరోజూ ప్రసారం చేయబడుతోంది. వీటిని డిజిటైజ్ రూపంలో 7 ఏసీడీలు గా మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ 2015 లో విడుదల చేసిన విషయం అందరికీ విదితమే. ఈ కావ్య సంగీత యజ్ఞంలో దాదాపు 11 ఏళ్ళ పాటు పాల్గొని పాడిన మన ఏకైక తెలుగు గాయని శ్రీమతి కె. సీతా వసంత లక్ష్మి. 

రామనవమి సందర్భంగా ఇందులోంచి మీకోసం ఒక ప్రసంగం. బాలకాండం 326 నుంచి 328 వరకూ గల దోహాలు ఇక్కడ ఆలపించారు కె. సీతా వసంత లక్ష్మి. హిందీ కవిత్వంలో దోహా మన ద్విపద వంటి పద్యరూపం.

ఈ ఘట్టంలో సీతారాముల కల్యాణ సమయంలో ఆ వధూవరుల రూపవర్ణన, వారు ధరించిన విభిన్న ఆభూషణాల సహితంగా సీతారాముల వర్ణన, లక్ష్మణ, భరత శత్రుఘ్నుల వర్ణన, ఆరోజు అందచేయబడిన విందు, బహుమతుల సహితంగా వర్ణించబడుతోంది. విని ఆనందించండి…..   

 

 

***************************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page