Daily Archive: September 1, 2020

10_002 వార్తావళి

ప్రముఖ రచయిత రెంటాల గోపాలకృష్ణ గారి శత జయంతి సందర్భంగా ‘ నవ్య కవితా కల్పనా శిల్పి – శ్రీ రెంటాల ‘ – ప్రముఖ రచయిత శ్రీ విరించి గారి ఉపన్యాసం సెప్టెంబర్ 05 వ తేదీ సాయింత్రం గం. 6.00 లకు youtube / Face book లలో…….

10_002 మా ఊరు – అమలాపురం

కాలువలనిండా నీరు బంగారంలా ప్రవహించి కాలువల గట్టున కొబ్బరిచెట్లు బంగారు హారానికి నగిషీలా అన్నట్టు, చెట్లమధ్య అమృత కలశాలైన కొబ్బరి కాయలు అమ్మ కడుపు పండి చంకలో తన సంతానాన్ని ఎత్తుకున్న చందాన మనకు గోచరిస్తుంది. అలాంటి  కోనసీమకు గుండెకాయ వంటి పట్టణం అమలాపురం. దీనికి “పాంచాలపురం ” అని పేరు ఉండేదని ఒక ఐతిహ్యం ఉంది. కానీ చిందాడమడుగులో వెలసిన పార్వతీ సమేత అమలేశ్వర స్వామి నామం తో ఈ ఊరికి ” అమలాపురం ” అనే పేరు వచ్చిందని చెబుతారు.

10_002 డొక్కా సీతమ్మ గారి నిత్యాన్నదాన వ్రతం

చిన్నపిల్లల్ని సముదాయిస్తూ “ ఎంతమ్మా ! మనం సీతమ్మ గారి ఊరికి దగ్గరలోనికి వచ్చేసాం ! ఆ తల్లి మనకి వేడి వేడి పాలు అవీ ఇస్తుంది. అన్నపానాలు సమకూరుస్తుంది. మనం సేద తీరి వారింట ఈ రాత్రి విశ్రాంతి తీసుకొని మరునాడు ప్రొద్దున్నే వెళ్ళవచ్చు ” అని అనుకుంటున్నారట. ఆ మాటలు ఆవిడ చెవిన పడగానే ఆవిడ ఈ సమయాన నేను ఇంటిన లేకపోతే వీరికి తగిన సదుపాయాలు ఎవరూ చేయరు, ఆ స్వామి దర్శనం మరెప్పుడైనా చేసుకోవచ్చునని తలంచి వెంటనే మేనాని గన్నవరానికి తిరిగి తీసుకు వెళ్ళమని చెప్పారట. అలాగే ఆమె వారికన్నా ముందుగానే ఇంటికి వచ్చి వారికి కావలసిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారట. అన్నార్తుల హృదయాలలో ఆ స్వామి ని దర్సించగలిగిన సాధ్వీమణి ఆమె”.

10_002 అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – బతుకు పడవ

నేను చిన్నప్పుడు అలాంటి వాతావరణంలో పెరిగినదాన్ని కనుక, పైపెచ్చు నేను కోనసీమ అమ్మాయిని. నా బుర్ర వజ్రాలగని! మా ఊళ్ళో వానాకాలం వచ్చిందంటే మాకు వెకేషన్ అన్నమాటే! మనసు ఎప్పుడూ ఆటల మీద, అల్లరి మీద ఉండే నాలాంటి వాళ్లకు వానలు పడినప్పుడల్లా బడి మూత పడటం పెద్ద బెనిఫిట్! బళ్ళోకి వెళ్ళక్కరలేదు సరిగదా, ఇంట్లో కూర్చుని బోలెడు ఆటలు ఆడుకోవచ్చు.

10_002 తో. లే. పి. – సత్తిరాజు రామ్‌నారాయణ

సత్తిరాజు వారి వంశ పెన్నిధి లో మూడు అనర్ఘరత్నాలు ~
ముగ్గురు అన్నదమ్ములు.
లక్ష్మీనారాయణ గారు, శంకరనారాయణ గారు, రామ్‌నారాయణ గారు.
అయితే విశేషమేమంటే ఈ ముగ్గురికీ మారు పేర్లు, బ్రాండ్ నేమ్స్ కూడా ఉన్నాయి. అవేమిటంటే…
లక్ష్మీనారాయణ గారు — బాపు గారు
శంకర నారాయణ గారు – శంకర్ గారు
రామ్‌నారాయణ గారు – రాంపండు గారు.

10_002 కథావీధి – మధురాంతకం రాజారాం రచనలు

ఈయన జీవన విధానమే ఈయన రచనా శైలి. వృత్తి రీత్యా ఉపాధ్యాయులు ప్రవృత్తి వ్యవసాయ నేపథ్యం, జీవన శైలి రాయలసీమ గ్రామీణం.” సత్కవుల్ హాలికులైన నేమి? ” అని ప్రశ్నించుకునే పోతన తత్వం. జీవన విధానంలో ఆర్ధిక పరమైన అంశాలకు తక్కువ ప్రాధాన్యం. రచయితగా ఏ రకమైన ఇజాలనీ, వ్యక్తిగా ఏరకమైన భేషజాలనీ సమర్ధించని వ్యక్తిత్వం. అన్ని ఇజాలకూ మూలం, వాటి సారం మానవత్వమే అని దృఢంగా విశ్వసించే నైజం.

10_002 శ్రీపాద కథలు – గూడు మారిన కొత్తరికం

సభ్యత గుర్తుంచుకుని మసలుకోగల వారికి, సార్థక నామం అయి ఆ ఊరు కలిగించే మధురానుభూతి మరచిపోవడం శక్యమా ? అని తమ ఊరినీ, అక్కడ ప్రేమాభిమానాలు, ఆదరణ, ఆప్యాయత లను మధురానుభూతులన్ను మురిసిపోతూ వర్ణిస్తారు శ్రీపాద వారు. చిత్రం ఏంటంటే పాఠకులను ఆ పరిసరాలలోకి లాక్కొని వెళ్లిపోతారు. రచయితలాగే పాఠకుడు కూడా ఆ గ్రామీణ వాతావరణంలో తాదాత్మ్యం పొంది కథలో పాత్రలా మమేకం అవుతారు.

10_002 వెలుగు నీడలు

తే. గీ. నీరె ఆవిరిగా మారి నింగి నంటు –
మరల ఆవిరి నీరుగా మారి భువికి
చేరు ; నీదుసంకల్పాన జీవరాశి
పయన మొనరించు క్రిందికి పైకి నిట్లె !

error: Content is protected !!