September 2020

10_003 వెలుగునీడలు

తే. గీ. గాలి పోగానె మట్టిలో కలసిపోవు
జాలిబ్రతు కిది; దీనికై గాలిమేడ
లెన్ని కట్టిన నన్నియు నిట్టె కూలు !
జాలిపడి లాభ మే ? మిది గాలిబ్రతుకు !

10_003 కందుకూరి రుద్రకవి – కొండోజీ అనుబంధం

“మీకు సార్వభౌముల దర్శనం లభించడానికి, నాకు చేతనైనంత సాయం చేస్తాను.”
ఈ చిన్న మాట కందుకూరి రుద్రకవి కన్నులను ఆనందాశ్రువులతో నింపింది.
స్నేహహస్తం అందించిన ఆ రాయల వారి మంగలి పేరు కొండోజీ.

10_003 ఇది వరమో ! శాపమో !!

శ్రీకృష్ణుడు నాడు చెప్పేదాకా అంచల పొందిన వరం గురించి వసుసేనునికి తెలియదు. వసుసేనుడు నిలువునా దిగ్భ్రాంతుడయ్యాడు. అసంకల్పితంగా అతని కంటి వెంట కన్నీరు కారుతూనే ఉంది. అంచల తన దగ్గిర దాచిన రహస్యం గురించి తెలిసి వసుసేనుడు నివ్వెరపోయాడు, నిలువునా నీరయ్యాడు. రారాజుకు తాను వాగ్ధత్వబానిసననే రహస్యం అంచలకు తెలిసి కూడా ఆమె తనపట్ల చూపిన ప్రేమానురాగాలకి, గౌరవప్రపత్తులకి కదిలిపోయాడు. అతని హృదయం గర్వంతోనూ, ఆనందంతోనూ తొణికింది.

10_003 సౌభాగ్యలక్ష్మీ !

ఓ సౌభాగ్యలక్ష్మి !
నీవు సదా గొప్ప వారి మనస్సులతో
సుగుణవంతుల హృదయములలో
సజ్జనుల గృహములలో నివసింతువు కదా !

10_003 స్త్రోత్రమాలిక – శుక్లాంభరధరం

ఏ పని ప్రారంభించాలన్నా మనకి ముందుగా గుర్తుకు వచ్చేది విఘ్ననాయకుడైన గణపతి. తలపెట్టిన పని నిర్విఘ్నంగా సాగాలని ముందుగా ఆ గణపతి ని పూజించి అసలు పని ప్రారంభిస్తాము. గణపతి అనగానే మనకి గుర్తుకు వచ్చే ధ్యాన శ్లోకం “ శుక్లాంభరధరం విష్ణుం…. ”.

10_002 వార్తావళి

ప్రముఖ రచయిత రెంటాల గోపాలకృష్ణ గారి శత జయంతి సందర్భంగా ‘ నవ్య కవితా కల్పనా శిల్పి – శ్రీ రెంటాల ‘ – ప్రముఖ రచయిత శ్రీ విరించి గారి ఉపన్యాసం సెప్టెంబర్ 05 వ తేదీ సాయింత్రం గం. 6.00 లకు youtube / Face book లలో…….

10_002 మా ఊరు – అమలాపురం

కాలువలనిండా నీరు బంగారంలా ప్రవహించి కాలువల గట్టున కొబ్బరిచెట్లు బంగారు హారానికి నగిషీలా అన్నట్టు, చెట్లమధ్య అమృత కలశాలైన కొబ్బరి కాయలు అమ్మ కడుపు పండి చంకలో తన సంతానాన్ని ఎత్తుకున్న చందాన మనకు గోచరిస్తుంది. అలాంటి  కోనసీమకు గుండెకాయ వంటి పట్టణం అమలాపురం. దీనికి “పాంచాలపురం ” అని పేరు ఉండేదని ఒక ఐతిహ్యం ఉంది. కానీ చిందాడమడుగులో వెలసిన పార్వతీ సమేత అమలేశ్వర స్వామి నామం తో ఈ ఊరికి ” అమలాపురం ” అనే పేరు వచ్చిందని చెబుతారు.

10_002 డొక్కా సీతమ్మ గారి నిత్యాన్నదాన వ్రతం

చిన్నపిల్లల్ని సముదాయిస్తూ “ ఎంతమ్మా ! మనం సీతమ్మ గారి ఊరికి దగ్గరలోనికి వచ్చేసాం ! ఆ తల్లి మనకి వేడి వేడి పాలు అవీ ఇస్తుంది. అన్నపానాలు సమకూరుస్తుంది. మనం సేద తీరి వారింట ఈ రాత్రి విశ్రాంతి తీసుకొని మరునాడు ప్రొద్దున్నే వెళ్ళవచ్చు ” అని అనుకుంటున్నారట. ఆ మాటలు ఆవిడ చెవిన పడగానే ఆవిడ ఈ సమయాన నేను ఇంటిన లేకపోతే వీరికి తగిన సదుపాయాలు ఎవరూ చేయరు, ఆ స్వామి దర్శనం మరెప్పుడైనా చేసుకోవచ్చునని తలంచి వెంటనే మేనాని గన్నవరానికి తిరిగి తీసుకు వెళ్ళమని చెప్పారట. అలాగే ఆమె వారికన్నా ముందుగానే ఇంటికి వచ్చి వారికి కావలసిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారట. అన్నార్తుల హృదయాలలో ఆ స్వామి ని దర్సించగలిగిన సాధ్వీమణి ఆమె”.

10_002 అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – బతుకు పడవ

నేను చిన్నప్పుడు అలాంటి వాతావరణంలో పెరిగినదాన్ని కనుక, పైపెచ్చు నేను కోనసీమ అమ్మాయిని. నా బుర్ర వజ్రాలగని! మా ఊళ్ళో వానాకాలం వచ్చిందంటే మాకు వెకేషన్ అన్నమాటే! మనసు ఎప్పుడూ ఆటల మీద, అల్లరి మీద ఉండే నాలాంటి వాళ్లకు వానలు పడినప్పుడల్లా బడి మూత పడటం పెద్ద బెనిఫిట్! బళ్ళోకి వెళ్ళక్కరలేదు సరిగదా, ఇంట్లో కూర్చుని బోలెడు ఆటలు ఆడుకోవచ్చు.