October 1, 2020

10_004 భువిలో విరిసిన పారిజాతం

హిందీలో విపరీత ఆదరణ రావడానికి కారణం వివరిస్తూ ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ బాలు పాటని ఇంకో మరాఠీ గాయకునితో పోలుస్తూ ‘ మీ పాట తెర మధ్యనుంచి వస్తే ఆ గాయకుడిది ఒక పక్కనుంచి మాత్రమే ధ్వనిస్తుంది ’ అన్నారట. బాలు తానెప్పుడూ సంగీతం నేర్చుకోలేదు గానీ ఒక సినిమా పాటని ఎలా పాడితే వినసొంపుగా ఉంటుందో ఆ సూత్రం తెలిసిన వాణ్ణని చెప్పుకునేవారు.

10_004 మేఘబంధం

ఎన్నిసార్లు నాచెక్కిళ్లపై కనురెప్పలపై
చిలిపి తుంపర్ల సరసాలాడలేదు?
దోబూచులాటల్తో ఆటపటిస్తూ
ఉరుముల మెరుపుల సందేశాలు
కానుక చేయలేదు.. ఈ మేఘమాల ..?

10_004 స్వరరహస్యవేది

పరుసవేది నీగళమును తాకిన
ప్రతిభాషా బంగారం !
నీవు ధరించేప్రతిపాత్రా
కళాసరస్వతిమణిహారం !

10_004 అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – గుర్తింపు

కానీ.. చాలామంది నన్ను చూసి, నిన్నగాక మొన్న ఏదో ఒక్క పెళ్లి చేసి, గ్రాండ్ చిల్ద్రెన్ రాకుండానే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ గ్రాండ్ పేరెంట్స్ అసోసియేషన్ లో దూరిపోయి ఇంత పాపులారిటీని ఎలా సంపాదించానా అని అనుమానిస్తూ, అసూయ పడటం గమనించాను. కానీ నేను ఎంత కష్టపడి ఈ గుర్తింపు సంపాదించుకున్నానో వాళ్ళకు తెలీదు.
అసలు ఏమైందంటే —–

10_004 మహాత్మాగాంధీ శతజయంతి – ఒక జ్ఞాపకం

1969 లో శ్రీ మహాత్మాగాంధీ శతజయంతి ఉత్సవాలు యూకే లోని లండన్ లో ఉన్న సెయింట్ పాల్స్ కేథీడ్రల్ లో జరిపారు. ఈ ఉత్సవానికి స్వతంత్ర భారత దేశపు చివరి గవర్నర్ జనరల్ శ్రీ లార్డ్ మౌంట్ బ్యాటన్ గారు అధ్యక్షత వహించారు. బ్రిటన్ భారతదేశ రాయబారి తో సహా ఇరవైఐదు దేశాల ప్రతినిధులు హాజరు అయ్యారు.
ఈ ఫంక్షన్ కి నన్నూ, కీ.శే. శ్రీమతి టంగుటూరి సూర్యకుమారి గారినీ గాంధీజీ ప్రియ భజనలు పాడమని అడిగినప్పుడు నా ఆనందం వర్ణనాతీతం.

10_004 అమ్మమాట, నాన్నబాట – గాంధీమార్గం

మా తండ్రిగారు విద్యావేత్త, సంఘ సంస్కర్త, యుగ సంధిలో భాగమై రాజకీయ, సాంఘిక, మత, సాంస్కృతిక రంగాలలో విశాఖ ప్రవరగా నిల్చిన సుసర్ల గోపాలశాస్త్రి గారు; మా తల్లి గారు భావుక హృదయిని, బహుభాషా విదుషి, అభ్యుదయ వాది, విద్యా శక్తీ, కళానురక్తీ ఏకమైన విశిష్ట వ్యక్తి సీతా దేవి చూపిన మార్గం ” గాంధీ మార్గం “. ఆ బోధనలలో బాల్యం, ఆ సాధనలలో చదువుల కాలం సాగాయి. ఈనాడు ఆ ఉపదేశం ఆసరాగా నిలిచింది.

10_004 నివాళి – ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

అటు సంగీతపరమమైన విద్వత్తు మాత్రమే కాకుండా, మరొక ప్రక్క వినయశీలత, సౌహార్దము కూడా ఇతోధికంగా చోటుచేసున్నాయి. అందువలననే ఆయన ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది శ్రోతల హృదయాలలో ఏనాటికి చెరగని, తరగని స్ధానాన్ని సంపాదించుకున్నారు. నిజానికి అదే అసలు సిసలైన సిరి, సంపద అన్నమాట ! బిరుదులూ, సన్మానాలు కంటే అదే మిన్న. అసలు అయన పేరే ఒక మహత్తు… విద్వత్తు… సూక్ష్మంగా విశ్లేషించి చూస్తే ఆయన( పేరు) లో సరస్వతీదేవితో బాటుగా మరో నలుగురు దేవుళ్ళు పీఠం వేసుకుని కూర్చున్నారు.

10_004 కథావీధి – ఆడవాళ్ళ అంతరంగం

తమకు, ( అనగా మేష్టారికి ) బతకడం చేత కాదనీ, ఆ విషయం ఏనాడో ఋజువై పోయిందనీ, మనకు కోర్కెలు తీర్చుకునే తాహతు లేదనీ, ఏదో దొరికింది తింటాం. మనుషుల్లా ఇలా ఉంటాం. కాకపోతే రెండేళ్ల కొకర్ని లెక్కగా కంటాం అనీ “ ఈ మాత్రానికి లేనిపోని సోదె లు ఎందుకులెండి. ఒక ఇల్లాలు మొగుడు కొట్టినందుకు కాక ఇతరులు నవ్వినందుకు ఏడ్చిందట. మనకు సంపాదన చేతకాక ఇంకొకళ్ళని చూసి ఉక్రోషం పడడం ఎందుకు లెండి ఇహ ఊరుకోండి ” అని సంభాషణ ముగిస్తుంది.

10_004 భావ వ్యక్తీకరణ… పత్రికల నిర్వహణ – గాంధీజీ

తన కమ్యూనికేషన్ కు మాటను, మౌనాన్నీ వినియోగించారు. సంభాషణ, ప్రసంగం, పాత్రికేయం ఆయన సాధనాలు. సుమారు నలభై సంవత్సరాలు ఆయన చాలా క్రియాశీలంగా పత్రికలు నడపడం గమనార్హం. ప్రపంచాన్ని చేరాలంటే ఇంగ్లీషు వాడినా మాతృభాషను, భారతీయ భాషలను ఆయన నిరాదరించలేదు. ఆయన తొలి పుస్తకంతో పాటు ఆత్మకఠను కూడా గుజరాతీలో రాశారు. పత్రికలే కాదు కరపత్రాలు ప్రచురించారు. పుస్తకాలు కూడా వెలువరించారు. మాట పనిచేయని ఛోటా, వేళా మౌనవ్రతం కూడా పాటించారు. తన అభిప్రాయాన్ని వెల్లడించారు.