October 1, 2020

10_004 వెలుగునీడలు

తే. గీ. తనను పగులగొట్టగ వచ్చునినుమునైన
బంగరుగ మార్చివేయును పరుసవేది !
నిన్ను ద్వేషించి దూషించునీచునైన
మోక్ష మిచ్చి రక్షింతు వోముక్తిదాత !

10_004 సౌభాగ్యలక్ష్మి

ఓ సౌభాగ్యలక్ష్మి !
సంసారమనే స్వేదముతో
కలుషమైన మోహజాలంలో
మానవులు మునిగి త్రేలుచున్నారు.
అమ్మా ! మానవ జీవితమన్న
ఎత్తు పల్లములతో కూడినదిగదా !

10_004 స్త్రోత్రమాలిక – శుక్లాంబరధరం

సర్వ వ్యాపకుడైన విష్ణువుగా గణపతి ని చెప్పుకోవచ్చు. నాలుగు భుజములు కలిగినవాడు గనుక చతుర్భుజుడు. అసలు చతుర్భుజుడు అంటే అర్థమేమిటి ? మన లాగే రెండు చేతులు కాకుండా నాలుగు చేతులు ఎందుకు ఉన్నాయి ? అవి దేనికి సంకేతాలు ? మనకి రకరకాల విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి.