November 15, 2020

10_007 ఆనందసిద్ధి

చాలామంది కొన్ని తప్పుడు అభిప్రాయాలలో ఉన్నారు. ఆధ్యాత్మికం అనేది ఉద్యోగ విరమణ తరవాత మాత్రమే పట్టించుకునేది అని, కొండల లోకి, గుహల లోకి పోయి తపస్సు చేస్తేనే లభిస్తుందని, గృహస్థాశ్రమం కాకుండా సన్యాసం తీసుకుంటేనే అది లభిస్తుందని, సంస్కృతం నేర్చుకుని శాస్త్రాలు చదివుతేనే అది లభిస్తుందని, సరి అయిన అవగాహన లేని వాళ్ళు అభిప్రాయం పడుతూ ఉంటారు. మూఢ నమ్మకాలను అధిగమించి జీవితాన్ని ఆనందమయం  ఎలా చేసుకోవచ్చో చెప్పే రహస్యాలు అనేకం ఉపనిషత్తులలో ఉన్నాయని  చాలా తక్కువమందికి తెలుసు

10_007 శివ సంకీర్తనావళి

నటరాజ శ్రీ – శంకర శంకర
నటనోత్సుక శ్రీ – శంకర శంకర
నాట్య ప్రవీణా – శంకర శంకర
నాట్యాచార్యా – శంకర శంకర

10_007 కార్తీకమ్

కార్తిక మాసంలో ప్రధానంగా పారాయణం చేసే గ్రంథం ‘ కార్తిక పురాణం ‘. ఈ మాసము సాధనకు అనువైన మాసముగా చెప్పుకోవచ్చు. సూర్యుడు తనకు సంబంధించిన నీచమైన రాశిలో ఉంటాడు. అందువలన ఆత్మసాధన మీద దృష్టి పెట్టడం వలన మంచి జరుగుతుంది. ఈ మాసము శివుడికి, విష్ణువుకి ఇద్దరికీ ప్రీతికరమైన మాసముగా చెప్పుకుంటాము. కార్తిక మాసములో ఆచరించే విషయాలలో ముఖ్యంగా తెల్లవారుఝామునే చేసే కార్తిక స్నానములు, ఉపవాసము ముఖ్యంగా సోమవారములు – వాటి పద్దతులు మొదలైన విశేషాలు తెలియజేస్తున్నారు …. డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు.