December 15, 2020

10_009 కదంబం – చిత్ర కళా ప్రపూర్ణుడు ‘ బాపు ‘

తెలుగుదనానికి, తెలుగు సంప్రదాయానికి తన గీతలతో, చేతలతో ఒక గుర్తింపు తీసుకొచ్చిన గొప్ప కళాకారుడు ‘ బాపు ’. తెలుగులో ఎందరో లబ్దప్రతిష్టులైన చిత్రకారులు ఉన్నా, తెలుగు చిత్రకారులు అంటే ఠక్కున గుర్తుకొచ్చేది ‘ బాపు ’ అనే పేరే. తెలుగు ‘గీత’కారుడు ‘ బాపు ’. ఈ నెల 15వ తేదీన ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ…..

10_009 వార్తావళి

ఉత్తర అమెరికా తెలుగు సంఘం వారి 2020 బాలల సంబరాలు, దాసు సుభాషితం వారి CPB – SPB తెలుగు పోటీ 2020 వివరాలు…..

10_009 ఆనందవిహారి

అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 69 వ వర్థంతి సందర్భంగా ఈరోజు ( 12-12-2020 ) సాయంత్రం గం. 6. 00 లకు మొదటగా “ అమరజీవి – జీవితం – బలిదానం ” అనే అంశం పైన, తర్వాత పొట్టి శ్రీరాములు గారి అనుయాయి స్వర్గీయ వై. యస్. శాస్త్రి గారి 106 వ జయంతి సందర్భంగా “ అమరజీవి స్మృతిని శాశ్వతం చేసిన… వై. యస్ శాస్త్రి ” అనే అంశం పైన ప్రముఖ రంగస్థల నటులు, రచయిత శ్రీ వాడ్రేవు సుందరరావు గారి ప్రసంగాలు… అనంతరం “ మహాను’బాపు’డు – ఎప్పటికీ చెరిగిపోని సంతకం ” అనే అంశం పైన ప్రముఖ కార్టూనిస్ట్ నర్సిం గారి ప్రసంగం…….

10_009 తో. లే. పి. – ఇన్గే స్టెగ్ ముల్లర్

అనాదిగా వస్తూన్న భారతీయ సంస్కృతీ, సంప్రదాయాల గురించిన అవగాహన ను అందరికీ విస్తృత స్థాయిలో కల్పించడమే ఈ సంస్థ ప్రధానోద్దేశము. ఈ సంస్థ కార్యకలాపాల నేపథ్యం లో మన ప్రాచీన పురాణ ఇతిహాస గ్రంధాలు, జ్యోతిష శాస్త్రం, శాస్త్రీయ సంగీతము, సాహిత్యము, వైద్యం మొదలైనవి చోటు చేసుకున్నాయి. రుద్రాభిషేకం వంటి పూజా కార్యక్రమాలు, హోమియో, ఆయుర్వేద వైద్య సేవ వంటివి సుశిక్షితులైన వారి పర్యవేక్షణలో నిర్వహింపబడుతున్నాయి, ఈ విధంగా శిక్షణ పొందినవారిలో మన భారతీయులతో బాటుగా విదేశీయులు కూడా ఉండడం విశేషం.

10_009 అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – తప్పించుకు తిరుగువాడు

మీరు గమనించారో లేదో, నేను అమెరికా వచ్చి కూడా అంటగిన్నెలు తోముకుంటూనే ఉన్నాను..షాపుకెళ్ళి వెచ్చాలు తెచ్చుకుంటూనే ఉన్నాను. అందులో మార్పేమీ లేదు. ఇండియాలోనే ఉన్నట్టయితే, అప్పట్లో నా గిన్నెలు నేను తోముకున్నా ఆ తర్వాత నెమ్మదిగా పనివాళ్ళను పెట్టుకుని సుఖపడేదాన్ని. మీరు నన్ను ఇక్కడికి తెచ్చి నాకు ఒరగపెట్టిందేమి లేదు. అమెరికా వస్తే అన్నిపనులు ఆటోమాటిక్ గా అయిపోతాయని…అంచేత ఆడవాళ్ళకు ఆవగింజంతైనా వర్రీ ఉండదని నన్ను నమ్మించారు. కానీ అమెరికాలో ఆడవాళ్ళకు, అందులోనూ నాబోటి వాళ్లకు అన్నీ వర్రీలే అని ఇక్కడకు వచ్చాకగానీ తెలీలేదు.

10_009 కథావీధి – రావిశాస్త్రి రచనలు 5

ఒకరోజు సందేలప్పుడు తెల్ల సలవ బట్టలు కట్టుకుని కంపినీ సిలక నెంటేసుకుని స్కూటర్ మీద సినిమాకి బయల్దేరిన బంగారి గాడు ఊరిలోకి కొత్తగా దిగిన గవుర్నమెంటాసుపత్రి కోతల డాక్టర్ లా జెనానికి అనిపించేలా వుంటాడు. దార్లో ట్రాఫిక్ దిమ్మ మీద నిలబడి డూటీ చేస్తున్న సూర్రావెడ్డు గారిని చూసి రోడ్డుపక్కన బండినీ, సిలకనీ నిలబెట్టి, తాను ఒంటరిగా వెళ్ళి నమస్తే గురూ అని సూర్రావెడ్డు గారిని పాత బాషలో పలకరించగా బంగారి గాడిని ఆనమాలు కట్ట లేక సూర్రావెడ్డు గారు కంగారుపడతారు.

10_009 పాలంగి కథలు – ధనుర్మాసం … తిరువళ్లిక్కేణి

“ శ్రీనివాసా గోవిందా! శ్రీ వెంకటేశా గోవిందా! భక్తవత్సలగోవిందా! భాగవతప్రియా గోవిందా! ” అంటూ ఆ రోజు పాడవలసిన రాగంలో అందుకున్నాడు పద్దూ. మేమంతా వంత కలిపాం. ప్రతిరోజూ నగర సంకీర్తన పూర్తయాక గోదాదేవి పూజ, తిరుప్పావై, హారతి నైవేద్యం అయ్యాక ఇచ్చిన ప్రసాదాలు…అవే పొంగళ్లు తెచ్చుకుని కుముదవల్లి వాళ్ల అరుగు మీద కూర్చుని తింటుంటే మా బాచ్‌ వాళ్లకి మర్నాడు పాడబోయే నామావళి ఏ రాగంలో పాడాలో చెప్పేవారు అయ్యంగార్‌ మామ.