February 1, 2021

10_012 వార్తావళి

వంగూరి ఫౌండేషన్ నిర్వహిస్తున్న “ 26వ ఉగాది ఉత్తమ రచనల పోటీ ” వివరాలు, దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం ( TASC ), ఉత్తర అమెరికా తెలుగు సంఘం ( NATS ) సంయుక్త సమర్పణ లో సురభి వారి “ మాయబజార్ ” పౌరాణిక నాటక ప్రదర్శన వివరాలు….

10_012 ఆనందవిహారి

చెన్నై లోని ‘ అమరజీవి స్మారక సమితి ‘ ఆధ్వర్యంలో ‘ నెల నెలా వెన్నెల ‘ జనవరి కార్యక్రమం అంతర్జాలంలో “ తమిళనాట తెలుగు రాజుల ఆలయ శిల్ప చిత్ర కళావైభవం “ ఉపన్యాసం, చెన్నై లోని ‘ వేద విజ్ఞాన సమితి ‘, ఆంధ్ర సోషల్ & కల్చరల్ అసోసియేషన్ సహ నిర్వహణలో ‘ తరతరాల తెలుగు కవిత ‘ కార్యక్రమం లో “ గజేంద్ర మోక్షం – పోతన హృదయం “ ఉపన్యాసం… విశేషాలు

10_012 ద్విభాషితాలు – గురు సన్నిధి

ఆ తీగపై కోయిల వాలి…
గొంతు సవరించింది.
మేడపై పెద్ద హాల్లో చుట్టూరా వీణలు. నా ముందు తపోదీక్షలో కూర్చొన్న మునిలా గురువు గారు. ఆయన నోటితో పాఠం చెబితే నేను అర్థం చేసుకొని వీణపై వాయించాలి. అగ్ని పరీక్షే! నా మనోభావాల్ని చదివినట్లున్నారు. “నా మీటు.. నా బాణీ.. నీ నరనరాల్లో జీర్ణించుకుపోయాయి. అర్థంకాని వారికి ఎదురు వీణ. నీకెందుకు?” అన్నారు నవ్వుతూ!

10_012 తో. లే. పి. – మధురాంతకం నరేంద్ర

రాజారాం గారి పుత్రులు నరేంద్ర, మహేంద్ర కూడా తండ్రిబాటలోనే అడుగులు వేస్తూ సాహితీ పిపాసను ప్రోది చేసుకున్నారు. వాస్తవానికి తండ్రి రచనలను విమర్శనాదృక్పధంతో సమీక్షను చేసే తొలి వ్యక్తులు ఈ అన్నదమ్ములే. నిజానికి ఇద్దరికీ కూడా సాహిత్య పిపాస మెండుగా ఉండేది. రాజారాం గారి ఇల్లు సాహితీగోష్టులకు వేదిక గా ఉండేది. వీరి ఇంట ఆ రోజులలో తరచుగా జరిగే సాహితీ గోష్టులలో పేరెన్నికగన్న రచయితలెందరో పాల్గొంటూ ఉండేవారు. ఆ గోష్ఠులు ఈ అన్నదమ్ముల సాహిత్యాభిలాష మరింతగా పెరగడానికి దోహదపడేవి.

10_012 అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – అబ్బరం…అపురూపం

ఈ కాలప్పిల్లలు వాళ్ళే పిల్లల్ని కంటున్నారనుకుంటారు. అవసరం అయినప్పుడల్లా పిల్లల్ని చూసుకోడానికి మనం కావాలి. కానీ పిల్లల్ని మనమీద వదిలెయ్యాలంటే వాళ్లకు చచ్చేటంత అనుమానం. “ఆర్ యు షూర్ యు కెన్ హాండిల్ దెమ్” అంటూ అడుగుతారు.

10_012 పాలంగి కథలు – నా చిన్నతనం…నాన్నగారు

నా చిన్ననాటి ముచ్చట్లు చెప్పడం మాత్రమే నా ఉద్దేశ్యం కాదు. కానీ ఆనాటి ఉన్నతమైన విలువలూ, వాటి ప్రభావం ఒక సంపూర్ణ వ్యక్తిత్వాన్ని కలిగించగల తీరూ, అన్నిటికీ మించి తలిదండ్రులు తమ పిల్లలకి ఉత్తమ అభిరుచులు కల్గించటం ఆ రోజుల్లో దైనందిన జీవితంలో ఎలా సాధ్యపడిందీ వాటి గురించి చెప్పాలీ అంటే నా చిన్నతనం… నాన్నగారు… నేనూ –

10_012 కథావీధి – చాసో కథలు 01

ఆ సంధ్యా సమయం లో వీస్తున్న చల్లగాలి పక్కింటి వారి పెరటిలో వెలగ పూవుల పరిమళాన్ని, రాజ్యం దగ్గరికి మోసుకుని వస్తుంది. అలాగే ఆ తెమ్మెర మోసుకుని వస్తున్న పక్కింటి వారి అమ్మాయి మధురం గా ఆలపిస్తున్న తోడి రాగం ఆలాపనలు, వాయిస్తున్న వాయులీన స్వరాలూ రాజ్యాన్ని ఏదో తెలియని లోకాలకీ, చిన్నతనపు జ్ఞాపకాలలోకీ తీసుకుని వెళ్ళ గా ఆమె వివశురాలవుతుంది. తాను కూడా త్వరగా కోలుకుని, పుట్టింటి నుంచి తెచ్చుకుని భద్రం గా పెట్టె లో దాచుకున్న వాయులీన వాయిద్య సాధననీ, మధ్యలోనే వదిలేసిన గాత్రాన్నీ తిరిగి ప్రారంభించాలి….

10_012 చండాలిక

రక్తసిక్తమైన కత్తి పట్టుకొని యాజ్ఞవల్క్యుడు నిల్చుని ఉండగా అతని వెనుక ధర్మాన్ని రక్షించటానికి కంకణబద్ధులైన సకల విప్రాళి సంతుష్టాంతరంగులై నిలుచుని ఉన్నారు. గార్గి నిశ్చేష్టురాలై ఉండిపోయింది. “ యాజ్ఞవల్క్యా ! నువ్వు ఓడావు. అగ్రపూజకు నువ్వు అనర్హుడివి. బ్రాహ్మణులు కత్తి పట్టేది క్షత్రియులు ధర్మం తప్పినప్పుడు కాదు. చండాలురు జ్ఞానప్రకటన చేసినపుడు అని నువ్వే స్వయంగా నిరూపించావు ”అని చండాలిక తల తెగిపడిన చితిమంటలు వేయి నాలుకలు ఘోషించాయి. ఆ మంటలు ఆర్పటానికి ఋషులు చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయి.