May 2021

10_018 బాలభారతి-తేనెటీగలు

పూలగుండె నొప్పింపక తేనెలు
పుణికి పుణికి తీసుకు వస్తాయి !
ఉన్నవారికడ తెచ్చిన దంతా
లేనివారికే పంచేస్తాయి !

10_018 వాగ్గేయకారులు-మైసూర్ సదాశివరావు

తమ శిష్యులకు తామే గొప్ప సంగీతజ్ఞులమనే గర్వం ఉండరాదని సతతం హెచ్చరిస్తూ ఉండేవారు. ఏ సంగీతమూ తక్కువకాదనీ, ఎలా పాడేవారినైనా కించపరచరాదని బోధించేవారట. వీరు చాలా ఆచారవంతులు. లక్ష్మీనరసింహులను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించేవారట. వీరికి ఏ గురువూ లేరనీ, కేవలం దైవకృప వల్లనే సంగీతం అబ్బిందనీ కొందరు అభిప్రాయం పడుతూ ఉంటారు.

10_018 వేదార్థం – అగ్నిసూక్తం 3

సృష్టిలో మూడు అగ్నులు ఉన్నాయి. మన శరీరంలో మూడు అగ్నులు ఉన్నాయి. అందుకే మన ఇంటి యందు కూడా మూడు అగ్నులను పెడతారు. యజ్ఞశాలలో మూడు అగ్నులు ఉంటాయి. సృష్టిలో సూర్యుడు ఒక అగ్ని. విద్యుత్ ఒక అగ్ని. భూమి మీద ఉండేది ఒక అగ్ని. మన శరీరంలో కూడా మన మెదడు ఒక అగ్ని, మనం తీసుకున్న ఆహారాన్ని పచనం చేసే అగ్ని మరొకటి, సంతానోత్పత్తి కి కారణమైన అగ్ని ఇంకొకటి…… “ అగ్నిమీళే పురోహితమ్……” అనే వేద శ్లోకానికి పూర్తి అర్థం, వివరిస్తూ ఈ త్రేతాగ్నుల గురించి…..
వేదముల గురించి, వాటిలోని అంతరార్థం గురించి మరిన్ని విశేషాలు….

10_017 వార్తావళి

చెన్నై అమరజీవి స్మారక సమితి వారి ‘ నెల నెలా వెన్నెల ’ కార్యక్రమంలో భాగంగా ‘ నెట్ ’ ఇంట్లో సమావేశం “ పి. వి. రాజకీయ సాహితీ వ్యక్తిత్వం, కృష్ణా జిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవ కార్యక్రమ వివరాలు…..

10_017 ఆనందవిహారి

చెన్నై లోని అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి నిర్వహిస్తున్న ‘ నెల నెలా వెన్నెల ‘ కార్యక్రమంలో భాగంగా
“ వీరనారి ” ……..

10_017 సుమాంజలి

శ్రీనిధి దేశ విదేశీ సాంకేతిక విజ్ఞాన నవనిధి
శాస్త్రి గారి చేతి రక్షాబంధనం దేశ రక్షణా ప్రభంజనం
దేశ రక్షణ పరికరాల తయారీకి జంటనగరాలలో స్థాపించిన నవనిధి

10_017 బోట్స్‌వానా లో ఉగాది

అక్కడ మన దేశస్థులు కలుసుకునేందుకు “ హిందూ టెంపుల్ ” ఉంది. ప్రతివారం మన తెలుగు వాళ్లందరం కలిసి భజన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము ఉగాదికి.
అంతవరకు కొద్దిమంది కలిసి పండగలు చేసుకునేవారు. కానీ మేము ఉగాదికి భజన కార్యక్రమం మొదలు పెట్టాము. మొదటిసారిగా భజన పద్ధతిగా అంటే – గణేశ ప్రార్థన, భగవంతుని ఇతర నామాలతో భజనలు ఇంగ్లీష్, తెలుగులో రాసి పంచి పాడించేవాళ్లం. ఆఖరుగా మంగళహారతి, ప్రసాదాలతో సహా క్రమ పద్ధతిలో జరుపుకునేవాళ్లం.

10_017 తో. లే. పి. – కోలవెన్ను సాంబశివరావు

భగవద్గీత లోని పద్ధెనిమిది అధ్యాయాలలోని శ్లోకాలను చివరి నుండి మొదటికి అసలు పుస్తకం చూడకుండా అప్పజెప్పగలిగేవారు. తమ స్వంత కారులో పిల్లలని రోజూ మా కాలనీకి దూరంగా వున్న స్కూళ్లకి పంపుతూ ఆ డ్రైవర్ కి చెప్పేవారు ఇతర స్కూల్ పిల్లలు ఎవరైనా వస్తారేమో అడిగి వారిని కూడా ఎక్కించుకుని జాగ్రత్తగా తీసుకుని వెళ్లమని. ఆయనకు  చీఫ్ ఇంజినీర్ గా  ప్రమోషన్ ఇచ్చి హైదరాబాద్ కి  పోస్టు చేసారు.