June 2021

10_020 వాగ్గేయకారులు – ధర్మపురి సుబ్బరాయ అయ్యర్

వీరి గురించి వ్రాస్తూ, శ్రీ టి. శంకరన్ గారు ” తమ పడకపై తలగడ క్రింద ఒక చిన్న పుస్తకాన్ని ఉంచుకుని, మనసులోకి ఎప్పుడు ఏ జావళీ స్ఫురిస్తే అప్పటికప్పుడు వెంటనే దానిని వ్రాసుకునేవారట. అందరు మహానుభావుల వలెనే, కళల ద్వారా ధనార్జనలో గల కష్టాన్ని చవిచూసిన వారి సతీమణి, తమ సంతానానికి తండ్రి పోలికలు రారాదని నిరంతరం ప్రార్థించేవారుట.

10_020 పురాణములు

పురాణమునకు ప్రధానంగా అయిదు లక్షణాలు చెప్పారు. అందులో మొదటిది సర్గము అంటే సృష్టి. రెండవది ప్రతి సర్గము అంటే సృష్టి విస్తరణ గురించి, మూడవది వంశము, నాలుగవది మన్వంతరాణి అంటే 14 మంది మనువుల కథలు, ఈ అంశాలన్నిటినీ వర్ణిస్తూ వ్రాసిన గ్రంథమునే పురాణము అంటారు.

10_019 వార్తావళి

అమరజీవి స్మారక సమితి, చెన్నై వారి ఆధ్వర్యంలో నెల నెలా వెన్నెల కార్యక్రమంలో భాగంగా జూన్ నెల కార్యక్రమం వివరాలు, తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలంలో అంగన్ వాడీ బాలలకు వితరణ కార్యక్రమ వివరాలు……

10_019 ఆనందవిహారి

అమెరికాలో శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ఆధ్వర్యంలో జరిగిన “ వీణ సంప్రదాయాలు – 2021 ” కార్యక్రమ విశేషాలు……

10_019 సులోచన సులోచనాలు

సులోచన మధ్య తరగతి గృహిణి. డాబా గది ఎన్నో రిపేర్లు చేస్తేనే గది అని అనిపించుకుంటుంది.
పై కప్పు కొన్నిచోట వర్షం కురుస్తుంది, కిటికీ రెక్క ఒక ఒకటి ఊడి వేళ్ళాడుతున్నది.
గోడలు సున్నం ముఖం చూసి, పదేళ్ళు ఆయె.
అత్యవసరంగా అద్దెకు దిగిన వాళ్ళు ఒకట్రెండు నెలల్లో వేరే ఇల్లు చూసుకుని మారిపోతున్నారు.
అందుకే ఈసారి సులోచన కొత్తగా అద్దెకు వచ్చిన ఆగంతకుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది.
ఆమె భర్త గవర్నమెంటు ఆఫీసు లో క్లార్కు, జేబులో ఓ మూలకు ఇమిడే జీతం డబ్బులను బుద్ధిగా భార్య చేతిలో పోసేస్తాడు,

10_019 బోట్స్‌వానా లో తెలుగు బోధన

ముందుగా ఒకే పోలిక గలిగిన అక్షరాలు ఎంచుకుని చిన్న చిన్న చార్టుల మీద రాసి, ఉచ్చారణ చెప్పేవాళ్ళం. ‘ అయ్యో ! అదేమిటి అ, ఆ లు అక్షరక్రమం లేకుండా ? ” అన్న విమర్శ వచ్చింది. అప్పుదు నేను విశదీకరించి పోలికలు గల అక్షరాలు గుర్తించడం నేర్చుకుంటే క్రమం త్వరగానే పట్టుబడుతుందని చాలా శ్రమపడి ఒప్పించగలిగాను.

10_019 ద్విభాషితాలు – నిజఫలం

సన్నని పదునైన కత్తితో…
అతను బొప్పాయిపండుపై చెక్కును..
లాఘవంగా తీసి..
అరటి ఆకు ముక్కలో అందిస్తుంటే..
ఓ ప్రకృతి సౌందర్యాన్ని…
దోసిళ్ళలో ప్రదర్శిస్తున్నట్లుంటుంది.

10_019 తో. లే. పి. – మద్దాళి ( కిన్నెర ) రఘురాం

సంగీతం, సాహిత్యం ఆయనకు అభిమాన విషయాలు కావడంతో ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారిని సభాముఖంగా సన్మానించి, తద్వారా సరస్వతీసేవలో తరించారు. రఘురామ్ గారు కిన్నెర వ్యవస్థాపక కార్యదర్శిగా గత 40 సంవత్సరాలకు పైగా వ్యవహరిస్తూ, విశిష్ట కార్యక్రమాలను అనేకం రవీంద్రభారతి, తదితర కేంద్రాలలో విజయవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు. అలుపెరుగని బాటసారి ఆయన…