November 15, 2021

11_006 ముకుందమాల 02

బిడ్డలమైన మనను తండ్రి ప్రేమకు పాత్రులను చేసేది తల్లి శ్రీ. ఆమె లక్ష్మి. కృష్ణావతారంలో రాధగా, రుక్మిణిగా వచ్చినది ఆతల్లియే! ఆమె నాశ్రయిస్తే ఆమె ద్వారా పరమేశ్వరానుగ్రహం లభిస్తుంది. ఆ తల్లి అనుగ్రహం లేనిదే భగవదనుగ్రహం లభించడం కష్టం. భగవానుని నామాల్లో స్వామికి ఇష్టమైన నామం శ్రీవల్లభ! అందుకే ముందుగ ఆ నామంతో కీర్తించడం! అలా కీర్తించిననాడు భగవానుడు మనలను రక్షించకుండా ఉండలేడు. అమ్మద్వారా ఆశ్రయించడమే మన యోగ్యతగా, మనకు వరాలిస్తాడు.