12_003 కన్యాశుల్కం – ఒక పరిశీలన 02
నాటకం లో కన్యాశుల్కం, వయో వృద్ధులతో బాలికల కు వివాహం జరిపించడం అనే విషయాలని సౌజన్యా రావు వకీలు తప్ప విడిచి వేరెవరూ ఖండించరు. మిగతా పాత్రలకి కన్యాశుల్కం అసలు విషయమే కాదు. ముగింపు అర్ధాంతరం గా ఉంది అని మనకి ముందు అనిపించినా, అదే తార్కికమైన, సహజమైన ముగింపు అని మనకే అనిపిస్తుంది. రచయిత కి ఇంకో దారి ఉండదు.