January 15, 2023

12_007 కన్యాశుల్కం – ఒక పరిశీలన

కరటక శాస్త్రి అభ్యర్ధన మేరకు మధురవాణి మారువేషం లోసౌజన్యరావు పంతుల్ని కలుసుకుని, అతనితో చర్చించి, అతని సంస్కార డోల్లతనం బయట పెట్టి, గుంటూరు శాస్త్రిని తాను బయట పెడతాను అనీ, దానికి ప్రతిఫలం గా సౌజన్యరావు పంతులు తనని ముద్దు పెట్టుకోవాలి అని షరతు విధిస్తుంది, ముందు బెట్టు చేసిన పంతులు విధి లేక అంగీకరిస్తాడు, మధురవాణి అతన్ని వారించి, గిరీశం నిజరూపం బయట పెడుతుంది.

12_007 నాట్య మయూరి – లలితా సింధూరి

నాట్యమయూరి లలితా సింధూరి వినయశీలత, ఆప్యాయత ల గురించి ఎంత చెప్పినా తక్కువే ! ఆ సందర్భం లో ఆ అమ్మాయితో ఇంటర్వ్యూ రూపం లో ముచ్చటించగా కొన్ని విశేషాలను తెలియజేసింది.

12_007 గ్రామ దేవతల పూజలు – కోడి పందేలు

కోడి పుంజులను పట్టుకు వచ్చిన పందెం కాసిన వారిని కవి వర్ణిస్తున్నాడు. కాషాయ బట్టలు కట్టుకొని ఉన్నారు. దారములు కట్టుముడులు, కత్తిపిడులు పట్టుకు వచ్చారు. నీళ్ళతో నిండిన ముంతలు, కోళ్ళకు గాయాలైతే ప్రధమ చికిత్సకు కొన్ని మూలికలు, కత్తుల పొదులు, కోళ్ళకు కట్టే కత్తులు తెచ్చారు. సరంజామా అంతా సిద్ధం చేసుకొని కోడి పందేలకు పందెం కాసేవారు హుషారుగా వచ్చారని అర్థం.

12_007 సంగీతం – సర్వేశ్వరుని చేర్చే సాధనం 06

అందరు దేవీదేవతలను తమ ఆరాధ్య దైవంలో చూడగలగటం, అందరు దైవాలలోనూ తాను ఉపాసించే మూర్తేనని భావించడం నిజమైన భక్తి. మహానుభావులే మన వాగ్గేయకారులందరూ అటువంటి పరిణితి చెందిన భక్తులు, భాగవతోత్తములు.

12_007 ప్రేరణ గీతం

పిల్లల కోసం, సమైక్యతా భావాన్ని వారిలో కలిగిస్తూ, విభిన్న సంస్కృతులపట్ల సహనం, సుహృద్భావం, అవగాహనా కలిగి ఉండాలని వ్రాసిన ప్రేరణాత్మక గీతం. పాడేది కర్ణాటక శైలి. భాష హిందీ. రంగురంగుల పూలమాల ఈ పాట.

12_007 ముకుందమాల – భక్తితత్వం

ఏనుగు కొలనులో దిగి శుభ్రంగా స్నానం చేస్తుంది. తిరిగి బైటికి రాగానే దుమ్ముని మీద చిమ్ముకుంటుంది! మరింత దుమ్ము అంటుకోవడానికే కానీస్నానం వలన ప్రయోజనమేమీ ఉండదు. అందుకే భక్తిహీనకార్యాన్ని గజస్నానంతో పోలుస్తారు
అందుకే తీర్థయాత్రల్లో స్నానం చేశాము అనుకోవడం రాజసం పెరగడానికి కాకరజస్తమస్సులు తొలగి సత్వగుణం పెరిగిభగవత్ప్రాప్తిని కల్గించడానికి ఉపయోగపడాలి. శ్రీమన్నారాయణ చరణ స్మరణ పూర్వకంగా చేసిన నాడు అలా ఫలప్రాప్తిని పొందవచ్చు భగవదనుగ్రహంతో.

12_007 ఉత్తరాయణం

సూర్యుడు తన నిరంతర యానంలో మకర రాశిలోకి ప్రవేశించే రోజునే ‘ మకర సంక్రాంతి ‘ అని పిలుస్తారు. దక్షిణ దిక్కు నుంచి ఉత్తర దిక్కు కు సూర్యుడు తన ప్రయాణ దిశను మార్చుకునే సందర్భాన్ని ‘ ఉత్తరాయణం ‘ అని అంటారు. ఈ ఉత్తరాయణం చాలా విశిష్టమైనది. ‘ ఉత్తరాయణ పుణ్యకాలం ‘ అనడం అందరూ వినే ఉంటారు. ఆ విశేషాలేమిటో డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు గతం లోని ఈ వీడియోలో వివరిస్తున్నారు.