February 15, 2023

12_008 సునాదసుధ – నగుమోము గనలేని

అమెరికా చికాగో దగ్గరలో ఫ్లాస్ మోర్ లో ఉన్న ‘ సునాదసుధ ‘ సంగీత కుటీరంలో జరిగిన గిటార్ పైన బర్కిలీ స్కూల్ సంగీత విశ్వవిద్యాలయంలో పాశ్చాత్య శాస్రీయ సంగీతంతో పాటు భారతీయ కర్ణాటక సంగీత బాణీ లో ప్రతిభ పొందిన “ జో రూఎన్ “, హిందూస్తానీ తబలా వాద్యంలో పేరు పొందిన “ ధనంజయ్ కుంటే “ ల ప్రదర్శన.
అభేరి రాగం, అది తాళం, త్యాగరాజ కీర్తన.

12_008 వన్నె వన్నెలా పూల తోట

ఇటీవలే స్వర్గస్తులైన కవి, విశ్రాంత అధికారి జే. బాపురెడ్డి గారి రచనకు సి. ఇందిరామణి గారి స్వరరచనలో బృంద గానం….

12_008 చేతికొచ్చిన పుస్తకం 11

“ సి. రాఘవాచారి సంపాదకీయాలు ”, చంద్రప్రతాప్ గారి “ నవ్వుల పువ్వుల చంద్రహాసం! ”, అవధానం అమృతవల్లి “ బువ్వపూలు ”, చంద్ర ప్రతాప్ “ టాంక్ బండ్ కథలు ”, రజిత కొండసాని “ ఒక కల రెండు కళ్ళు ” పుస్తకాల పరిచయం…..

12_008 బాలకృష్ణ మోహన – స్వరజతి

మోహన రాగం, అది తాళం లో కొచ్చెర్లకోట రామరాజు గారి స్వరరచన.
సంగీతానికి సంబంధించిన అన్ని విషయాలను ఇష్టపడే సహన అబ్బూరి, ఆస్ట్రేలియా లో ఉంటున్న వర్థమాన యువ గాయని. గాత్రంతో బాటు వైయోలిన్ కూడా వాయించగలదు. ఆమెకు జంతువులన్నా, పుస్తకాలు చదవడమన్నా చాలా ఇష్టం.

12_008 తాండవ శివుని పంచసభలు

శివ నర్తనం చూడాలన్న సంకల్పంతో ఆదిశేషుడు వ్యాఘ్రపాదుడనే ఋషితో కలిసి తపస్సు చేశాడు. ప్రసన్నుడైన శివుడు ఆనంద తాండవం చేసిన వేదిక కనక సభ. రెండు వేల సంవత్సరాలుగా వాస్తు, శిల్ప, ప్రదర్శనా కళల శాస్తాలను ప్రభావితం చేస్తున్న చిదంబరం దేవాలయంలో కనక సభ నెలకొని ఉంది.

12_008 అమెరికా అమ్మాయి నృత్య నీరాజనం

భారతీయ శాస్త్రీయ నృత్యాన్ని గురుముఖంగా ఆసక్తి తో అభ్యసించి, విశ్వవ్యాప్తంగా ప్రదర్శనలను ఇచ్చి పేరు ప్రఖ్యాతులను గడించినవారే ! నిజానికి, వారు పుట్టుక రీత్యా విదేశీయులే అయినా భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల పట్ల అత్యంత ఆసక్తిని, గౌరవాన్ని కలిగి పట్టుదలతో కృషిచేసి ఆ నాట్య రీతులను నేర్చుకొనడం ఎంతో ముదావహం, ప్రశంసనీయం !

12_008 అన్నమాచార్య కళాభిజ్ఞత 13

మనకి తెలిసినంతవరకు అన్నమాచార్యుడు మొట్టమొదటి ప్రజాకవి. అంటే తెలుగు భాషా వ్యవహార కవి అని చెప్పుకోవాలి. 15వ, 16వ శతాబ్దాల నాటి భాష, పలుకుబదులు, వ్యవహార విధానాలు, నిత్య జీవన సరళులు అన్నిటినీ కూడా పదాలుగా మలచి ప్రజల మనసులకి చేరువయ్యాడు.

12_008 బాలభారతి – బాలలూ !

కండబలముతో గుండెబలముతో
దండిమగల మనిపించాలి !
నీతికి నిలబడి నిజాయితీతో
జాతిపేరు నిలబెట్టాలి !