10_006

10_006 కదంబం – పురిపండా, కాళోజీ

నవంబర్ 13వ తేదీన ప్రముఖ రచయిత పురిపండా అప్పలస్వామి గారి జయంతి; మరో ప్రముఖ రచయిత, కవి కాళోజీ నారాయణరావు గారి వర్థంతి సందర్భంగా….. .

10_006 వార్తావళి

అంతర్జాలంలో హూస్టన్ ( US ) నుంచి “ శాస్త్రీయ సంగీత కచేరీలు “; అమరజీవి స్మారక సమితి, చెన్నై వారి ‘ నెల నెలా వెన్నెల ‘ నెట్టింట్లో; గ్రేటర్ శాక్రమెంటో తెలుగు సంఘం నిర్వహిస్తున్న కథ, కవితల పోటీల వివరాలు; నార్త్ అమెరికా తెలుగు సంఘం హూస్టన్ లో నిర్వహిస్తున్న దివాళి, దసరా ఉత్సవాల వివరాలు …..

10_006 నాట్య ‘ ప్రియ ‘

                                                           పువ్వు పుట్టగానే పరిమళించినట్లు…. ఆ అమ్మాయి పుట్టడమే కళాకారిణిగా పుట్టిందేమో...

10_006 లలితసంగీత ‘ మణి ‘ – ఇందిరామణి

శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న పద్మజ ఆసక్తి లలిత సంగీతం వైపే ఉండేది. దాని ఫలితమే సినిమా పాట పాడేలా చేసిందని ఇందిర గుర్తించారు. ఈ లలిత సంగీతంలోని విశేషమేమితో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పటినుంచి శ్రద్ధగా రేడియో లో లలిత సంగీతం వినసాగారు. శాస్త్రీయ సంగీతంలో ఎంత గొప్పతనం ఉన్నప్పటికీ అది పండిత వర్గానికే పరిమితమని, పామరులను రంజింపజేసేది సరళంగా, సులువుగా అర్థమయేటట్లు ఉండే లలిత సంగీతమేనని గ్రహించారు. అప్పటినుంచి లలిత సంగీత సాధన ప్రారంభించారు. శాస్త్రీయ సంగీతంలో పట్టు సాధించిన ఇందిర గారు త్వరగానే లలిత సంగీతంలో ప్రావీణ్యం సాధించారు.

10_006 తో. లే. పి. – మస్తాన్ రావు

ఎప్పుడూ వైట్  డ్రెస్ లో నీట్ గా ఉండేవారు. మంచి పెర్సనాలిటీ, చిరునవ్వు చిందించే ఆ ముఖం చూస్తే మాకు పరమానందం అనిపించేది. తెలివితేటలు అయన సొత్తు. కేవలం విషయం పరిజ్ఞానం మాత్రమే కాదు – మాట లో ఆదరణ, ఆప్యాయత, పని  నేర్పే విధానం, ఆదర్శవంతమయిన నడవడిక ను మాకు ఆయనే నేర్పారు. ఆయన అక్షరాలు అందమైన ఆడపిల్లల్లా ఉండేవి. ఆఫీసు కి రావడం లోనూ, పని చేయడం లోనూ పంక్యుయాలిటీ ని నిర్దేశించి, దానిని ముందు ఆయన ఆచరించి చూపి మాకు ఆదర్శవంతం గా నిలిచేవారు. కష్టం లో ఉన్న వ్యక్తి కి అతని నుండి దేనినీ ఆశించక సహాయం చేయడం ఆయనలోని విశిష్టత.

10_006 అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – క్రీమ్ ఆఫ్ ద క్రాప్

ఆ రోజుల్లో మధ్యతరగతి అమ్మాయిలకు మధ్య తరగతి ఆలోచన్లు, మధ్యతరగతి కోరికలే ఉండేవి. చేసుకున్నవాడు తిండీ, బట్టా ఇచ్చి పుట్టింటికి తరిమేయకుండా, కాస్తంత ప్రేమగా చూసుకుంటే అదే మహాభాగ్యం అనుకునే రోజులవి. అసలు మా రాతల ప్రకారం ఏ బళ్ళో టీచరుకో, ఏ తాలుకా ఆఫీసులో గుమాస్తాకో, మహా అయితే బ్యాంకులో ఏ క్లర్కు కో పెళ్ళాలై అత్తెసరు బతుకులు బతకాల్సిన వాళ్ళం! అలాంటిది నాలాంటి ఎంతోమంది ఇల్లాళ్లకు పెద్ద పెద్ద డాక్టర్లు, గొప్పగొప్ప ఇంజనీర్లు, పేరున్న సైంటిస్టులు భర్తలుగా వచ్చారంటే అది అదృష్టం కాక మరేమిటీ?!