10_006

10_006 కథావీధి – రావిశాస్త్రి రచనలు

వీరి ప్రత్యేకత వీరి పాత్రల సృష్టి. అది కథ కావచ్చు… నవల కావచ్చు… నాటకం కావచ్చు…. రచనలో పాత్రల నిడివితో పని లేదు. పాత్రలు ఎంత చిన్నవైనా సరే మన మనసులలొ నిలిచిపోతాయి. సేనాపతి రావు, కమ్మలింటి రాజు, గేదెల రాజమ్మ, మందుల భీముడు తో పాటు రొట్లప్పారావు, రత్తాలు, నర్సమ్మా, గంగరాజెడ్డు, సుబ్బులెడ్డు గారి తో సమానంగా అడారాదినారాయణా, వియత్నాం విమలతండ్రీ, ( ఈ తండ్రి పాత్రకి కధలో పేరు లేదు. అతను మనకి విమల తండ్రి గానే పరిచయం అవుతాడు )

10_006 పాలంగి కథలు – అత్తారింటికి పట్నం పిల్ల

మనసు బిక్కుబిక్కుమంటోంది. ఉత్తరాల్లో బోల్డు వలపు కురిపిస్తారు. వాటివల్ల నిత్య జీవితానికి ఏం ప్రయోజనం ? జీవితం ఎలా ఉండబోతోంది ? ఆయన నాకు రేపటినుంచి సాయం చేస్తాడా ఇంట్లో అలవాటు పడటానికి ? అదీ అనుమానమే. ఎంతసేపూ ఒక్క కొడుకైన తనంటే వాళ్లమ్మకెంతిష్టమో, చెల్లెళ్లంటే తనకెంతిష్టమో… వీటి గురించే ఉంటుంది ఉత్తరాల్లో. సంతోషమే ! ఆ ప్రేమ నాక్కూడా కాస్త పంచుతారా అని ? నిజానికి అత్తగారి చూపు కొరడా ఝుళిపించినట్టే ఉంటుంది ఏం మాట్లాడకపోయినా. మంచిచెడులు మనమేం చెప్పగలం ? ఏదైతే తప్పేను గనుక ! దేనికైనా సిద్ధంగా ఉండటమే !! ఆలోచనలు జోరీగల్లా ముసురుతున్నాయి.

10_006 వాగ్గేయకారులు – త్యాగరాజు

గాయక శిఖామణి, కవీశ్వరుడూ అయిన త్యాగరాజువారు, వారి రచనల్లో అనేక రసాలను పోషించారు. రామభక్తి సామ్రాజ్య చక్రవర్తి అయిన త్యాగరాజు గారు రాముడిని సంబోధిస్తూ వ్రాసిన కీర్తనలను జనులతో అన్నవి, అనుభవసారం గలవి, కలికాలాన్ని నిందించేవి, సగుణత్వాన్ని నిరూపించేవి, దివ్య వర్ణన, పూజావిధానం అనే శీర్షికల క్రింద విభజించవచ్చు. రామాయణంలోని ఘట్టాలను ఉదహరిస్తూ తనను నిర్లక్ష్యం చేయక వెంటనే రక్షించమని మొరపెట్టుకున్నారు. తనకు నారదముని ద్వారా ప్రసాదించబడిన “స్వరార్ణవం” గురించి “స్వర రాగ సుధా రస” అనే కృతి లో తెలియచేశారు. వీరు నారదమహాముని ద్వారా “నారదీయము” అనే గ్రంథాన్ని కూడా పొందారు. 

10_006 ఆనందసిద్ధి

బ్రాహ్మణ స్వామి అతని కళ్ళలోకి ఒక పది నిమిషాలు చూసి మెల్లిగ కంఠం సవరించుకుని ” నేను” ‘ నేను’ అంటున్నారు కదా ! అది నీలో ఎక్కడ నుంచి ఉదయిస్తోందో గమనిస్తే, మనసు అక్కడ లయిస్తుంది. అదే తపస్సు.  

” ఒక మంత్రం జపించినప్పుడు ఆ మంత్ర శబ్దం ఎక్కడ ఉదయిస్తోందో దానిని గమనిస్తే మనసు అక్కడ లయిస్తుంది. అదే తపస్సు ” 

10_006 నోట్టు స్వరాలు

సంగీత త్రయంలో ఒకరైన వాగ్గేయకారులు ముత్తుస్వామి దీక్షితర్ స్వరపరచిన నోట్టు స్వరాలు చిరంజీవులు అభిజ్ఞ, అనన్య ల స్వరాలలో….

10_006 సూర్య స్తుతి

ఆదిత్య హృదయము పరమ పవిత్రము

రహస్యమయము శత్రు వినాశకరము

సత్ఫలములిచ్చు దివ్యస్తోత్రము

చదివిన కలుగదు అపజయము

10_006 అట్లతద్ది – నరకాసుర వధ

ఆశ్వయుజ బహులా తదియ రోజున ముఖ్యంగా ఆడపిల్లలు జరుపుకునే నోము ‘ అట్లతద్ది ’.నరకాసురుడు అనే రాక్షస సంహారం జరిగిన సందర్భంగా ఆనందంగా జరుపుకునే పండుగ దీపావళి. ముందురోజు నరకాసురుని వధ జరిగింది గనుక ఆరోజును నరక చతుర్దశి అని వ్యవహరిస్తారు.