10_008

10_008 వార్తావళి

అంతర్జాలంలో హూస్టన్ ( US ) నుంచి “ శాస్త్రీయ సంగీత కచేరీలు “; అమరజీవి స్మారక సమితి, చెన్నై వారి ‘ నెల నెలా వెన్నెల ‘ నెట్టింట్లో; ఉత్తర అమెరికా తెలుగు సంఘం వారి 2020 బాలల సంబరాలు, దాసు సుభాషితం వారి CPB – SPB తెలుగు పోటీ 2020 వివరాలు…..

10_008 కదంబం – ఆంధ్రభాషోద్దారకుడు

” మినుకు మినుకు మంటున్న తెలుగు వాంగ్మయ దీపాన్ని స్నేహశిక్తం చేసి ప్రజ్వలింపచేసిన ఆంద్రభాషోద్దారకుడు ”
అని ప్రముఖ కవి జానమద్ది హనుమచ్చాస్త్రి కొనియాడిన మహనీయుడు చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్.

10_008 కదంబం – కట్ట’మంచి’ వారు

రెడ్డి గారు ఒకసారి మద్రాసు వెళ్ళవలసి వచ్చింది. సెంట్రల్ స్టేషన్ లో దిగి ప్లాట్ ఫాం మీదే నిలబడి చుట్టూ చూస్తున్నారు. అది గమనించిన ఒక విలేఖరి వచ్చి తనని పరిచయం చేసుకుని సహాయం కావాలా అని అడిగాడు. వెంటనే రెడ్డిగారు ” నాకిప్పుడు కావల్సినది రిపోర్టర్ కాదు, పోర్టర్ ! ” అన్నారు.

10_008 కదంబం – పాశ్చాత్య కర్ణాటక భాగవతార్

అవిరళ కృషితో, పట్టుదలతో సాధన చేసి ఆనతి కాలంలోనే తిరువాయూరులోని త్యాగరాజ ఆరాధనోత్సవంలో పాల్గోనగలిగారు. ఆ సమయంలోనే ఉచ్చారణ విషయంలో నిరసనలు ఎదుర్కొన్నారు. ఛాందసులు కొందరు ఆయన పాశ్చాత్య ఉచ్చారణను ఆక్షేపించారు. అయినా పట్టుదలతో తన ఉచ్చారణను సరి చేసుకున్నారు. చాలా కచేరీలు చేశారు. అనేక రికార్డులు వెలువరిచారు. భాగవతార్ బిరుదు కూడా అందుకున్నారు.

10_008 కదంబం – ప్రాప్తం

‘ మూగమనసులు ‘ తెలుగు చిత్రాలలో ఇదొక ట్రెండ్ సెట్టర్. సావిత్రి నటనా వైదుష్యానికి పరాకాష్ట. ఆ చిత్రం ఎంత విజయవంతమైందో అప్పటి తరానికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ ఘన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని తమిళంలో తనే స్వీయ దర్శకత్వంలో స్వయంగా నిర్మించింది సావిత్రి. అక్కినేని చేసిన గోపీ పాత్రను శివాజీ గణేశన్, జమున చేసిన గౌరి పాత్రను చంద్రకళ ధరించారు.

10_008 కదంబం – మామా ! మామా….!! మామా… !!!

మన మనస్సుల్లో మామగా తిష్ట వేసేంత స్థాయికి రావడం ఆయనకు నల్లేరు మీద బండి నడక కాలేదు. ఇలాంటి ఎన్నో కష్టనష్టాలు అనుభవించారు. ఎంతో కృషి, పట్టుదల ఆయన్ని ఈ స్థాయికి చేర్చాయి. భౌతికంగా ఆయన ఇప్పుడు లేకపోయినా ఆయన సంగీతం రూపంలో మన హృదయాల్లో ఇప్పటికీ సజీవంగానే వున్నారు.

10_008 కదంబం – గాన సామ్రాజ్య సామ్రాట్

ఆయన మద్రాసు వచ్చాక కూడా ఆయన్ని ఆ కూనిరాగం వెంటాడుతూనే వుంది. ఆయనలోని సంగీత కళాకారుడు ఊరుకోలేకపోయాడు. ఆ కూనిరాగంలోని బాణీని పట్టుకున్నాడు. ఫలితంగా కొత్త పాటకు బాణీ దొరికింది. తర్వాత కాలంలో ఘంటసాల విజయనగరం వెళ్ళినపుడు ఆ బాణీనందించిన కార్మికుణ్ణి గుర్తుపెట్టుకుని అతని దగ్గరకు వెళ్ళి మంచి బహుమానమిచ్చి గౌరవించారు

10_008 కదంబం – మన తొలి రాష్ట్రపతి

దక్షిణ ఆఫ్రికాలో సత్యాగ్రహం అనే ఆయుధాన్ని విజయవంతంగా ప్రయోగించి భారతదేశానికి తిరిగి వచ్చిన గాంధీజీ పిలుపుకు ప్రభావితులై స్వాతంత్ర్య సమరంలో ప్రవేశించారు రాజేంద్రప్రసాద్. ప్రముఖ రచయిత రాహుల్ సాంకృత్యాయన్ సాహచర్యంలో స్వాతంత్ర్యోద్యమం గురించి పత్రికలలో అనేక వ్యాసాలూ రాసారు. ఉద్యమ ప్రచారం కోసం అనేక ప్రాంతాలు పర్యటించారు. ఆ ఉద్యమంలో పూర్తి సమయం పనిచెయ్యడం కోసం బంగారు బాతు లాంటి న్యాయవాద వృత్తిని త్యజించారు.

10_008 కదంబం – విజయాచందమామ

తరతరాలుగా తెలుగువారందరి మదిలోను మిగిలిన అందమైన మధురానుభూతి ‘చందమామ’
కఠోర దీక్షే ఆయన్ని అడుగుపెట్టిన అన్ని రంగాలలో విజయుణ్ణి చేసింది
అర్జునుడు విజయుడై ఆయన్ని చిత్ర నిర్మాణం వైపు నడిపాడు
ఆంజనేయుడు ఆయనకు అండగా నిలిచి పతాకంపై నిలిచాడు