10_008

10_008 తో. లే. పి. – ఎమ్. వి. చంద్రన్

తొలిసారిగా మరుదాచలం ని కలుసుకుని వారింట ఆతిధ్యాన్ని స్వీకరించడం మరపురాని, మరువలేని తీయని అనుభూతి. ఇద్దరం చుట్టుపక్కల యాత్రాస్థలాలని ఎన్నిటినో చూసాము. దగ్గరలో ఉన్న ఒక సినిమాహాల్లో ఇద్దరం కలిసి ‘ సత్య హరిశ్చంద్ర ’ తమిళ సినిమా చూడడం విశేషం‌. నా తరువాత మజిలీ తిరువనంతపురం. చివరిగా ఎర్నాకుళం లో నాతో బస్‌స్టాండ్ కి కూడా వచ్చి, నన్ను తిరువనంతపురం వెళ్లే బస్ ని ఎక్కించి తను నాకు వీడ్కోలు చెప్పాడు.

10_008 అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – అమ్మాయి సీమంతం

చిరుతిళ్ళు అంటే మహా ఇష్టపడే మా అన్నయ్య, ఎప్పుడూ ఊళ్ళో ఎవరింట్లో పెళ్ళిళ్ళు జరుగుతాయా, ఎవరు పేరంటాలకు పిలుస్తారా అని ఎదురు చూసేవాడు. వాడికి ఏ ఏ సందర్భాలలో ఏమేం ఇస్తారో బాగా తెలుసు ! నేను పేరంటం నుంచి రావడం ఆలస్యం, నా జేబురుమాల మీద దాడి చేసి తనకు ఇష్ట్టమైనవి గబగబా తీసేసుకునేవాడు !

10_008 కథావీధి – రావిశాస్త్రి రచనలు

వాతావరణం చిలికి చిలికి గాలివానగా మారడం, సందిగ్దం లో ఉన్న పెళ్లికొడుకు తన తండ్రి గదమాయింపులకు వణుకుతూ పెళ్ళి పీటల మీంచి లేవబోతూండగా, తోపులాటలో ఎవరో పెట్రోమాక్సు దీపాన్ని తన్నేయడం ఆ మంటల వెలుగుల్లో పెద్దింటమ్మోరు లా మారిన పెళ్ళికూతురు “ నాకు మొగుడు గా వుండడానికి పనికిరాకపోతే నా పెళ్ళాంగానైనా బతుకు ” అంటూ పెళ్ళికొడుకు చేతిలో నుంచి తాళి బొట్టును లాక్కుని అతని మెడలో కట్టడం జరిగిపోయాయి.

10_008 పాలంగి కథలు – పాలంగీ… మా పెద్దత్తగారూ… నేనూ…

ఆరోజుల్లో…ఊళ్లో ఎవరిళ్లల్లో అయినా పెళ్లిళ్లూ, కార్యాలూ జరిగితే పెద్ద పెద్ద వంటగిన్నెలు ఒకరివొకరు పట్టుకెళ్లి వాడుకుని తిరిగివ్వడం అలవాటు. అలా ఎవరైనా వచ్చి అడిగితే ఎవరో వచ్చి తీసివ్వాలి అనకుండా వెంటనే నిచ్చెన వేసుకుని చకచకా సామాను దింపే ఆవిడ హుషారే నాకు స్ఫూర్తి. పెద్దలనుంచి నీకు స్ఫూర్తి కలిగించే అంశాన్ని వెదుక్కుని నేర్చుకో అనేవారు మా నాన్నగారు ’. వారి ఆదేశమే నన్ను ఎన్నో విషయాలు నేర్చుకుని ఆచరించేలా చేసింది.

10_008 శ్యామశాస్త్రి

” సంగీత సాంప్రదాయ ప్రదర్శిని ” అనే గ్రంథ రచయిత అయిన శ్రీ సుబ్బరామ దీక్షితుల వారు శ్యామశాస్త్రి గారి గురించి ఇలా పేర్కొన్నారు – ” ఇతని కీర్తనముల గేయఫణతులు అతీతానాగతాగ్రహ చమత్కారములతో నారికేళపాక రీతిగా నుండుట వలన గాయకులలో తెలియని కొందరు సోమరులు రంజనము కల్గించుటకు సామర్ధ్యము లేక గడుసని చెప్పుచున్నారు.

10_008 ఆనందసిద్ధి

కష్టాలు కానీ, దుఃఖాలు కానీ వచ్చినప్పుడు, వాటి ప్రభావం నుంచి ఎలా బయటపడాలో ఆయన చెబుతానని అంటే, అది ఖచ్చితంగా, మంత్రమో, తాయెత్తో కాదని వాళ్ళకి తెలుసు. అటువంటి వాటి వల్ల ఖచ్చితంగా ఫలానా ఫలితం వస్తుందని హామీ ఎక్కడా లేదు. అది చాలామంది విషయం లో చూస్తూనే ఉన్నాము అనుకున్నారు.

10_008 శివ సంకీర్తనావళి

శివశివశివశివ – శంకర శంకర

          హరహరహరహర – శంకర శంకర

          ఢమరుకధరశ్రీ – శంకర శంకర

          సమీరజవినుత – శంకర శంకర

10_008 మార్గశీర్షమ్

“ మాసానాం మార్గశీర్షోః ” అని కృష్ణుడు చెప్పాడు. మృగశిరా నక్షత్రములో చంద్రుడు ఉండగా పౌర్ణమి వస్తుంది గనుక ఈ మాసానికి మార్గశీర్షము అని పేరు వచ్చింది. ఇది చంద్రమానము ప్రకారము చెప్పుకుంటాము. సూర్యమానము ప్రకారము సూర్యుడు ధనూ రాశిలో సంచరించే దినములు ఈ మార్గశీర్ష మాసముతో కలుస్తాయి. ఈ ధనుస్సంక్రమణం జరిగినపుడు గోదాదేవి రచించిన ‘ తిరుప్పావై ’ పఠించడం, కాత్యాయనీ వ్రతం చేయడము జరుగుతుంది.