10_009

10_009 కథావీధి – రావిశాస్త్రి రచనలు 5

ఒకరోజు సందేలప్పుడు తెల్ల సలవ బట్టలు కట్టుకుని కంపినీ సిలక నెంటేసుకుని స్కూటర్ మీద సినిమాకి బయల్దేరిన బంగారి గాడు ఊరిలోకి కొత్తగా దిగిన గవుర్నమెంటాసుపత్రి కోతల డాక్టర్ లా జెనానికి అనిపించేలా వుంటాడు. దార్లో ట్రాఫిక్ దిమ్మ మీద నిలబడి డూటీ చేస్తున్న సూర్రావెడ్డు గారిని చూసి రోడ్డుపక్కన బండినీ, సిలకనీ నిలబెట్టి, తాను ఒంటరిగా వెళ్ళి నమస్తే గురూ అని సూర్రావెడ్డు గారిని పాత బాషలో పలకరించగా బంగారి గాడిని ఆనమాలు కట్ట లేక సూర్రావెడ్డు గారు కంగారుపడతారు.

10_009 పాలంగి కథలు – ధనుర్మాసం … తిరువళ్లిక్కేణి

“ శ్రీనివాసా గోవిందా! శ్రీ వెంకటేశా గోవిందా! భక్తవత్సలగోవిందా! భాగవతప్రియా గోవిందా! ” అంటూ ఆ రోజు పాడవలసిన రాగంలో అందుకున్నాడు పద్దూ. మేమంతా వంత కలిపాం. ప్రతిరోజూ నగర సంకీర్తన పూర్తయాక గోదాదేవి పూజ, తిరుప్పావై, హారతి నైవేద్యం అయ్యాక ఇచ్చిన ప్రసాదాలు…అవే పొంగళ్లు తెచ్చుకుని కుముదవల్లి వాళ్ల అరుగు మీద కూర్చుని తింటుంటే మా బాచ్‌ వాళ్లకి మర్నాడు పాడబోయే నామావళి ఏ రాగంలో పాడాలో చెప్పేవారు అయ్యంగార్‌ మామ.

10_009 వాగ్గేయకారులు – భక్తి ప్రపూర్ణ రామదాసు

రామదాసు కీర్తనలలో కానవచ్చే సరళ భాష పండిత పామరులకు సమానంగా అర్థం అయి మనసుకును రంజింప చేస్తుంది. లయ తప్పని పదసరళి, వాడుక మాటలు, మధ్య మధ్య అలవోకగా దొర్లే ఉర్దూ పదాలు ఏ భాషనైనా నాలో ఇముడ్చుకోగల శక్తి తెలుగుకు ఉందని చెప్పక చెప్తాయి.

10_009 ఆనందసిద్ధి

మనం చాలా సందర్భాలలో జరిగిపోయిన వాటి మీద అనవసరమయిన చర్చలు, దెబ్బలాటలూ చేస్తూ ఉంటాము. జరిగిపోయినది ఏమీ మార్చలేమని గుర్తించి, ముందు పని ఆలోచిస్తే చాలా శాంతి గా ఉండవచ్చు. అంటే ఈ సిద్ధాంతం లో ముఖ్య విషయం, మనం ఏ పనులు చేసినా, దాని ఫలితాలు మన చేతిలో లేవని గుర్తించి, వచ్చిన ఫలితాలు దైవమో లేదా ఏదో అదృశ్య శక్తో ఇచ్చిన ప్రసాదం అని స్వీకరించి ముందుకు వెళ్లిపోవాలి

10_009 శివ సంకీర్తనావళి

పరమదయాళా – శంకర శంకర

 పరమేశ్వరశ్రీ – శంకర శంకర

 పరమాత్మాశ్రీ – శంకర శంకర

 వరప్రదాతా – శంకర శంకర

10_009 మార్గాళి – ధనుర్మాసం

ధనుర్మాసం ప్రవేశించింది. ఈ మాసములో తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతమునకు బదులుగా గోదాదేవి రచించిన తిరుప్పావై వినిపిస్తుంది. దీనివలన తిరుప్పావై ప్రాముఖ్యత మనకి తెలుస్తుంది. ఎవరీ గోదాదేవి ? ఆమె కథ ఏమిటి ? ఆమె రచించిన తిరుప్పావై కి ఎందుకంత ప్రాముఖ్యం లభించింది ? మొదలైన విశేషాలు తెలియజేస్తున్నారు డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు