10_010

10_010 కదంబం – నవరస నటీమణి

హావబావాలు అలవోకగా పలికించడంలోను, నవరసాల్ని అవలీలగా పోషించడంలోను, సంభాషణలు మంచి టైమింగ్ తో పలకడంలోను ఆమెకు ఆమే సాటి.

10_010 పండగ రావాలి

పరమశివునికి క్షీరాభిషేకములొక పక్క
నారాయణ స్మరణలతో హరిదాసులొక పక్క,

10_010 తో. లే. పి. – పి. నాగేశ్వరరావు

కానీ నాగేశ్వరరావు లో కష్టపడే స్వభావం ఉంది. చేసే పనిలో చిత్త శుద్ధి ఉంది. ఉద్యోగపు బాధ్యతలను చక్కగా, నిష్కామంగా నిర్వహించగలిగిన సామర్ధ్యం, నిర్వహించే అలవాటు ఉంది. అవతలివారిని గౌరవించి, ఆప్యాయంగా మాట్లాడుతాడు.

10_010 అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – అమ్మనే… జగదంబనే…

భగవంతుడి మీద నిజమైన భక్తి లేనప్పుడు, దేవాలయానికి వెళ్ళే పద్ధతి మీద గౌరవం లేనప్పుడు, గుళ్ళో పెట్టిన రూల్స్ ని పాటించాలన్న విచక్షణాజ్ఞానం లేనప్పుడు మీకు ఆలయానికి వచ్చే అర్హత లేదు. అసలు మీరు రావద్దు కూడా. మీకు కావలసింది పిచ్చాపాటి, చిరుతిండే అయితే, ఇలాంటి బట్టలు వేసుకుని ఏ రెస్టారెంటుకో వెళ్ళండి. అంతేకాని ఇలా గుడికి వస్తే ఊరుకునేది లేదు.

10_010 కథావీధి – రావిశాస్త్రి రచనలు

తన పాత జీవితానికి స్వస్తి చెప్పి నీతిగా బతికే దారి చూపమని అడగడానికి, దేవుడి దగ్గర కెడుతుంటే, దేవుడీ లంపటం ఎందుకు తగిలించాడో అని బంగారిగాడు ఆలోచిస్తూ వుండగా బండి బెజవాడ చేరుకుంటుంది. వరద గోదార్లా వున్న బెజోడ టేసన్లో కరెంటు లేక ప్లాట్ఫాం మీద దీపాలుండవు. జనం తోసుకుంటూ, తొక్కుకుంటూ బండెక్కుతూ వుంటారు. ఒక రాజకీయ నాయకుడు రైలెక్కుతూ వుండడం తో స్టేషన్ జిందాబాద్ డవున్ డవున్ లతో మారుమోగిపోయి రణరంగం అవుతుంది. ఆ చీకటినీ, గొడవల్నీ చూసి కంగారుపడ్డ పెళ్ళివారిలోని ఒక తింగరి ఆవిడ ” సజ్జ జేగర్తే ” అని హెచ్చరిక చేస్తుంది.

10_010 పాలంగి కథలు – మా ఊరు పాలంగి

మారే కాలానికి మౌనసాక్షులం మా తరం. మా ముందు తరం వాళ్లు అదృష్టవంతులు. జీవితాన్ని వాళ్లు అనుకున్న రీతిలో జీవించగలిగారు. కానీ మా తరం మార్పును చూడటమే కాదు… మార్పుకి గురవుతోంది కూడా – అందుకే గతాన్ని గుర్తు చేసుకుంటూ వర్తమానంలో బతికేస్తాం. ‘గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్‌’ అన్నారందుకే! ఇంకా కొంతకాలం గడిస్తే ఉండటానికి ఇళ్లే కానీ, పండించడానికి పొలాలుండవేమో అనిపిస్తుంది. తిండికి కటకటలాడాలా? ఏమో!!! పెద్ద పెద్ద భవంతుల్లో ఉంటూ అన్నానికి బదులు ‘గుళికలు’ మింగి బతుకుతారేమో జనాలు!! ఏమో!!? బహుకాలం బతికితే బహు వింతలు కళ్లజూడొచ్చు.