10_010 వాగ్గేయకారులు – పురందరదాసు
ఈయన ఒక గొప్ప భారతీయ తత్వవేత్త, హరిదాసు, వాగ్గేయకారుడు. ఆపై ముఖ్యంగా ఒక సమాజోద్ధారకుడు. ఒక కృష్ణ భక్తునిగా, ఒక వైష్ణవ కవిగా వీరు ద్వైత సాధువైన వ్యాసతీర్థుని శిష్యులు. ఆ విధంగా పండరినాథుని కొలవటం జరిగింది. అంతేకాక వీరి గురువు వీరిని గురించి తమ గేయాలలో ఇలా పేర్కొన్నారు కూడా: ” దాసరేంద్రరే పురందర దాసరాయ “. వీరు కర్ణాటక సంగీతానికి అందచేసిన అపూర్వ సంపద దృష్ట్యా వీరిని సాక్షాత్తూ నారదముని అవతారంగా భావిస్తారు.