10_012

10_012 త్యాగరాజ ఆరాధన

కర్ణాటక సంగీత ప్రపంచానికి ఎనలేని ఖ్యాతిని సమకూర్చిన వాగ్గేయకారుడు త్యాగరాజు తన దేహాన్ని విడిచిన రోజు పుష్య బహుళ పంచమి. ఆ మహానుభావుని స్మరించుకుంటూ కావేరీ నది తీరాన తిరువయ్యూరు లోని ఆయన సమాధి దగ్గర ప్రతి యేటా ఆరాధనోత్సవాలు నిర్వహించడం చిరకాలంగా సంప్రదాయం. ఆరోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కర్ణాటక సంగీత కళాకారులు చిన్నా పెద్దా తేడా లేకుండా ఆ సమాధి చుట్టూ కూర్చుని త్యాగరాజ పంచరత్న కీర్తనలు అలపిస్తారు.

10_012 అన్నపూర్ణాష్టకం

అమ్మలగన్నయమ్మ కాశీ అన్నపూర్ణమ్మ. ఆ అమ్మ పైన శ్రీమతి రాజవరం ఉష ఆలపించిన “ శ్రీ అన్నపూర్ణాష్టకం ”.

10_012 మాఘము

ఉత్తరాయణం ప్రవేశించాక వచ్చే మాసం మాఘమాసం. ఈ మాసంలో సముద్ర స్నానము ప్రాధాన్యత కలిగి ఉంది. కొన్ని మాసములు తప్ప మిగిలిన అన్ని మాసములలోనూ సముద్ర స్నానము నిషిద్ధం. ఈ మాఘమాసములో వచ్చే ముఖ్యమైన పండుగ రధసప్తమి. ఈ మాసమంతా ప్రతీ ఆదివారం సూర్యుని ఆరాధన చెయ్యడం సంప్రదాయం.
ఈ మాసంలో వచ్చే అమావాస్య మౌని అమావాస్య. మరొక ముఖ్యమైన పుణ్యదినం మాఘ పూర్ణిమ. ఆరోజు తప్పనిసరిగా సముద్ర స్నానం చెయ్యడం ఆనవాయితీ.