10_013

10_013 వార్తావళి

వంగూరి ఫౌండేషన్ నిర్వహిస్తున్న “ 26వ ఉగాది ఉత్తమ రచనల పోటీ ” వివరాలు, చెన్నైలోని ‘ వేద విజ్ఞాన వేదిక ’ వారి ఫిబ్రవరి ఉపన్యాస ధారావాహిక వివరాలు… సిలికానాంధ్ర వారి వ్యాసరచన పోటీల వివరాలు…..

10_013 ఆనందవిహరి

చెన్నై లోని ‘ అమరజీవి స్మారక సమితి ‘ ఆధ్వర్యంలో ‘ నెల నెలా వెన్నెల ‘ ఫిబ్రవరి కార్యక్రమం అంతర్జాలంలో “ మధుర గాయకుడు మన ఘంటసాల “ ఉపన్యాసం,

10_013 రాయల యుగం – స్వర్ణ యుగం

రాయల పాలనలో రాజ్యమంతటా అన్ని మతాల వారూ యథేచ్ఛగా ప్రశాంత జీవనం గడిపారని బార్బోసా అనే విదేశీయుడు పేర్కొన్నాడు. పాడిపంటలతో ఎంతో సుభిక్షంగా రాయలు రాజ్యపాలన చేసిన తీరుని విదేశీ యాత్రికులు ఎంతగానో ప్రశంసించారు. రత్నాలు రాశులుగా పోసి అమ్మడం ప్రపంచంలో ఎక్కడా లేదని కూడా వీరి రాతల వల్ల తెలుస్తోంది. 16వ శతాబ్ది కాలం తెలుగు సాహిత్యానికి స్వర్ణయుగమనే చెప్పాలి.

10_013 తో. లే. పి. – కె. విజయాదిత్యన్

గురుశిష్యుల సంబంధం వంటిదే వృత్తిలో పై అధికారికి, అతని క్రింద పని చేసే ఉద్యోగస్తునికీ మధ్యన ఉండే సంబంధం. గురువు తనవద్ద విద్యను అభ్యసించే విద్యార్థి నుండి కోరుకునేవి వినయవిధేయతలు, చదువుపట్ల ఆసక్తి, అంకితభావం, గురువుపట్ల గౌరవభావం. అదేవిధంగా అధికారి క్రింద పనిచేసే ఉద్యోగి కూడా తన బాధ్యతలను ఎరిగి తదనుగుణంగా ప్రవర్తిస్తే, లభించే విజయం లో అతనికి కూడా స్థానం ఉంటుంది.

10_013 అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – ఉరుకులు … పరుగులు

ఇక ఇప్పటి తరం వాళ్ళు సరేసరి! వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తుంటే, నాలాంటి వాళ్లకు కళ్ళు తిరుగుతాయి. ఇరవై నాలుగు గంటలు ఉరుకులే ఉరుకులు, పరుగులే పరుగులు. వీళ్లకు ” అవ్వా కావాలి-బువ్వా కావాలి “ అన్నట్టు ఏది తక్కువ కాకూడదు! పెద్ద పెద్ద చదువులు చదవాలి….ఇద్దరూ ఉద్యోగాలు చెయ్యాలి…కెరియర్ లో పైకి వెళ్ళాలి…. మళ్ళీ లక్షణమైన ఫ్యామిలి లైఫ్ కావాలి. సోషల్ లైఫ్ సరేసరి. పిల్లల ఏక్టివిటీస్…. పెద్దవాళ్ళ ఏక్టివిటీస్….బిజినెస్ ట్రిప్పులు….వెకేషన్ ట్రిప్పులు అంటూ ఎప్పుడూ పరుగులే!

10_013 పాలంగి కథలు – పెద్ద తరంగం

వేసంగి శలవలకి వచ్చిన నాకు, ఈ పాటలు గమ్మత్తుగా ఉండేవి! ఎందుకంటే అప్పటికే చెన్నపట్నంలో శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటూ, వర్ణాలూ, త్యాగరాయకృతులూ, దివ్యనామ కీర్తనలూ పాడటం వచ్చి, కాస్త గర్వం పెరిగిన రోజులవి! పైగా పదాలూ తిల్లానాలూ కూడా పాడే స్థాయికొచ్చానాయె!! ఈ తరంగాలూ, అష్టపదులూ, ఆధ్యాత్మరామాయణకీర్తనలూ బోలెడన్ని చరణాలతో, కాస్త చాదస్తపు రాగాల్తో (అని అప్పటి నా ఉద్దేశం) ఈ సంగీతం నేర్చుకోని వాళ్లు పాడుతూంటే…చెప్పొద్దూ!! నాకేవంత గొప్పగా అనిపించేది కాదు.

10_013 కథావీధి – చాసో రచనలు – 2

పెళ్లై పిల్లల్ని కని నడి వయసు లో కాలు మోపుతున్న సమయంలో ఒక సాయంత్రం సమయం లో తనని బాగా ఎరిగున్న ఒకతను ” నీకేమయ్యా అదృష్టవంతుడివి ” కొంచెం చనువుతో కూడిన అసూయ వ్యక్తం చేసి వెళ్లి పోవడంతో ఇతను ఆలోచనలో పడి జీవితంలోని ప్రతి మెట్టు దగ్గర తాను ఎలా దగా పడ్డాడో అవలోకనం చేసుకుంటాడు. తాను మోసపోయిన విషయం ఆదివరకే గ్రహించుకున్నా అణచి పెట్టుకుని భరించుకుంటాడు, కానీ ఇప్పుడీ మనిషి ఇలా అని నిప్పు రాజేయడం తో తన ఆలోచనలను ఏకరువు పెట్టుకుంటాడు.